Published : Feb 22, 2025, 09:27 PM ISTUpdated : Feb 22, 2025, 09:36 PM IST
India Pakistan: భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ రచ్చ మాములుగా ఉండదు. బ్యాట్ బాల్ పవర్ మాత్రమే కాదు అంతకు మించి. ఇది మాములు రచ్చ కాదు సామీ కోట్టుకోవడం ఒక్కటే తక్కువ అనే మ్యాచ్ లు ఉన్నాయి. అలాంటి టాప్-5 మ్యాచ్ ల వివరాల ఇప్పుడు తెలుసుకుందాం.
India vs Pakistan: క్రికెట్‌లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్, ఉత్కంఠ, ఉత్సాహాం.. ఇతర పోటీల్లో చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఆటతో మాత్రమే కాదు రెండు దేశాల మధ్య ఉన్న భావోద్వేగాలు ఉప్పొంగుతూ, జాతీయ గౌరవం కోసం ఇరు జట్ల ప్లేయర్లు తమ శక్తులన్నీ ఉపయోగించి గెలుపుకోసం పోరాటం చేస్తారు. కేవలం బ్యాట్, బాల్ తో మాత్రమే కాదు మాటలు దాటి నేరుగా కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అనే విధంగా సాగిన మ్యాచ్ లు చాలానే ఉన్నాయి. అలాంటి ఉత్కంఠ, ఉద్రిక్తలతో తీవ్ర దుమారం రేపిన టాప్-5 భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
26
5. గౌతమ్ గంభీర్ vs షాహిద్ అఫ్రిది, 2007
2007లో భారతదేశంలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గౌతమ్ గంభీర్, పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఎదురుపడ్డారు. గంభీర్ ఫోర్ కొట్టి తర్వాతి బంతికి పరుగుకోసం వస్తుండగా ఇద్దరు క్రికెటర్లు మైదానం మధ్యలో ఒకరినొకరు ఢీకొన్నారు.
అప్పటికే మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య పరిస్థితి హీటెక్కింది. ఈ ఘర్షణ తర్వాత తీవ్ర మాటల యుద్ధం జరిగింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకున్నారు. గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది ఇద్దరూ క్రికెట్‌తో పాటు సోషల్ మీడియాలో భౌగోళిక-రాజకీయ విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు.
36
Team India and Pakistan (Photo: X/ @BCCI/@TheRealPCB)
4. హర్భజన్ సింగ్ vs షోయబ్ అక్తర్, 2010
2010 ఆసియా కప్‌లో భాగంగా దంబుల్లాలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ హర్భజన్ సింగ్‌ను పదునైన బౌన్సర్‌తో పాటు మాటలతో బెదిరించడానికి ప్రయత్నించాడు. ఆట ఉత్కంఠభరితంగా ముగిసే దిశగా సాగుతుండగా.. తర్వాత ఓవర్ మొహమ్మద్ అమీర్ వేయగా హర్భజన్ విన్నింగ్ పరుగులు చేశాడు. మ్యాచ్ ముగించిన భజ్జీ క్రికెటర్ అక్తర్ ముందు తనదైన స్టైల్లో గెలుపును సెలబ్రేట్ చేసుకున్నాడు.
46
Image Credit: Getty Images
3. కిరణ్ మోర్ vs జావేద్ మియాందాద్, 1992
1992లో భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజం జావేద్ మియాందాద్ ఎగిరి గెంతుతూ భారత వికెట్ కీపర్ కిరణ్ మోర్ ను అనుకరించాడు. అప్పటికే మ్యాచ్ హీటెక్కింది. ఈ స్లెడ్జింగ్‌కు ప్రతిస్పందన భారత జట్టు తన దూకుడు పెంచుతూ పాక్ ను చిత్తు చేసింది. మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో పాక్ పై భారత్ గెలిచింది.
56
Image Credit: Getty Images
2. రాహుల్ ద్రవిడ్ vs షోయబ్ అక్తర్, 2004
2004లో బర్మింగ్‌హామ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్, షోయబ్ అక్తర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కొంత సమయం ఊరుకుంటే ఇద్దరు ఫైట్ చేసేలా కనిపించాడు. భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో ద్రావిడ్ 44* వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇద్దరు క్రికెటర్లు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు, అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ జోక్యం చేసుకుని ఇద్దరిని విడదీశారు.
66
ind vs pak
1. వెంకటేష్ ప్రసాద్ vs అమీర్ సోహైల్, 1996
1996 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరులో జరిగిన సమయంలో అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఆమెర్ సోహైల్ భారత ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ వేసిన బంతిని ఆఫ్-సైడ్ వైపుగా బౌండరీ కొట్టి చూడు అన్నట్టు ఎగతాళి చేశాడు. అప్పుడు ఏం మాట్లాడకుండా వెంకటేష్ ప్రసాద్ తర్వాతి బంతికి పాక్ ప్లేయర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పుడు పాక్ ప్లేయర్ కు పోరా అన్నట్టు పెవిలియన్ కు ప్రసాద్ దారి చూపాడు.