Champions Trophy history: ఆస్ట్రేలియాను దంచికొట్టాడు.. సూప‌ర్ సెంచ‌రీతో బెన్ డ‌కెట్ కొత్త రికార్డులు

Published : Feb 22, 2025, 07:31 PM IST

Champions Trophy history: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నాల్గో మ్యాచ్ లో ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.  బెన్ డ‌కెట్  సూపర్ సెంచ‌రీతో దుమ్మురేప‌డంతో ఇంగ్లాండ్ 351/8 ప‌రుగులు చేసింది.  

PREV
15
Champions Trophy history: ఆస్ట్రేలియాను దంచికొట్టాడు.. సూప‌ర్ సెంచ‌రీతో బెన్ డ‌కెట్ కొత్త రికార్డులు

Australia vs England: ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ వన్డే క్రికెట్‌లో తన మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో బెన్ డకెట్ మూడు అంకెల స్కోర్ ను సాధించాడు. ఇంగ్లాండ్ 50 పరుగుల మార్కును అందుకోక‌ముందే ఫిలిప్ సాల్ట్, జేమీ స్మిత్‌ల వికెట్ కోల్పోయిన త‌ర్వాత స్టార్ ఓపెనర్ జో రూట్‌తో క‌లిసి అత‌ను సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నెల‌కోల్పాడు.

25
Ben Duckett

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా బెన్ డ‌కెట్ 

బెన్ డకెట్ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ తో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అత్య‌ధిక వ్యక్తి స్కోర్ చేసిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. గత కొన్ని వ‌న్డేల మాదిరిగా కాకుండా బెన్ డ‌కెల్ ఆసీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో చాలా జాగ్ర‌త్త‌గా ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. సాల్ట్ నిర్లక్ష్యపు షాట్ తో పెవిలియ‌న్ చేరే స‌మ‌యానికి క్రీజులో బెన్ డ‌కెట్ నిల‌దొక్కుకున్నాడు. అద్భుత‌మైన షాట్స్ కొడుతూ  ప‌రుగులు పిండుకున్నాడు. డకెట్, రూట్ తో కలిసి 43/2 స్కోరు నుంచి ఇంగ్లాండ్ స్కోరును 200 దాటించాడు. ఈ క్ర‌మంలోనే 96 బంతుల్లో బెన్ డ‌కెన్ త‌న సెంచ‌రీ పూర్తి చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 143 బంతుల్లో ఎదుర్కొని 165 ప‌రుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి. 

35
Ben Duckett

నాథన్ ఆస్టల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బెన్ డ‌కెట్ 

ఆసీస్ పై సెంచ‌రీ ఇన్నింగ్స్ (165 ప‌రుగులు) తో  బెన్ డకెట్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. 2004లో ది ఓవల్‌లో USAపై 151 బంతుల్లో 145* పరుగులు చేసిన న్యూజిలాండ్‌కు చెందిన నాథన్ ఆస్టల్ రికార్డును బెన్ డ‌కెట్ బ‌ద్ద‌లు కొట్టాడు. 

డకెట్ గతంలో గ్రేమ్ స్మిత్ (141), సచిన్ టెండూల్కర్ (141), సౌరవ్ గంగూలీ (141*), ఆండీ ఫ్లవర్ (145) వంటి దిగ్గజాలను అధిగమించి అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. 

45

ఐసీసీ టోర్నమెంట్లలో బెన్ డకెట్ తొలి సెంచరీ

బెన్ డకెట్ కు వ‌న్డేల్లో ఇది మూడో సెంచ‌రీ. ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో తొలి సెంచ‌రీ. అలాగే, 6 హాఫ్ సెంచ‌రీలు కూడా సాధించాడు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డకెట్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. మూడు మ్యాచ్‌ల్లో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు.

ఇప్పుడు అత‌ను తిరిగి త‌న ఫామ్ ను అందుకుంటూ సెంచ‌రీ కొట్టాడు. వన్డేల్లో బెన్ డ‌కెట్ 20 మ్యాచ్‌ల్లో 52.42 సగటుతో 996 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 104 కంటే ఎక్కువగా ఉంది. 2016లో వన్డేల్లో అరంగేట్రం చేసిన బెన్ డకెట్ ఇప్పుడు ఇంగ్లాండ్ XIలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

55
England vs Australia

ఆసీస్ పై భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ 

శనివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ నాల్గవ మ్యాచ్‌లో జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. 

బెన్ డకెట్ 165 పరుగులు, జో రూట్ 68 పరుగులు, జోస్ బట్లర్ 23, జోఫ్రా ఆర్చర్ 21 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలలో ఆడం జంపా 2, మార్నస్ లబుషేన్ 2, బెన్ ద్వార్షుయిస్ 3, గ్లెన్ మ్యాక్స్ వెల్ 2 వికెట్ తీసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories