Champions Trophy 2025 Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు విజయాలతో గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. అలాగే, గ్రూప్ బీ లో టాప్ లో నిలిచి సౌతాఫ్రికా కూడా సెమీస్ చేరుకుంది.
Champions Trophy 2025 Semi Final, Champions Trophy 2025, Champions Trophy
Champions Trophy 2025 Semi Final: పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్లు తన చివరి గ్రూప్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్ మ్యాచ్ లు ఎప్పుడు? ఏ జట్లు తలపడనున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
25
Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఎప్పుడు?
ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు చేరిన నాలుగు జట్లు ఏవో తెలిశాయి. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ ఐసీసీ టోర్నమెంట్ లో గ్రూప్ A నుండి భారత్, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇక గ్రూప్ B నుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీలలో జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 4న దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాతో ఏ జట్టు తలపడుతుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
35
Image Credit: Getty Images
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ ను ఢీ కొట్టేది ఎవరిని?
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ కు భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు చేరాయి. సెమీ-ఫైనల్స్‌లో టీం ఇండియా ఎవరిని ఎదుర్కొంటుందనే నిర్ణయం మార్చి 2న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ పై ఆధారపడి ఉంటుంది. గ్రూప్ బీలో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 4 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. గ్రూప్ A లో టాప్-2 జట్లు భారత్,న్యూజిలాండ్ స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. మార్చి 2న జరిగే మ్యాచ్ తర్వాత, మొదటి, రెండవ స్థానాల్లో ఎవరు ఉంటారో తేలనుంది.
45
team India, cricket, IND
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీలో లో భారత్ తో తలపడే జట్టు అదేనా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిబంధనల ప్రకారం.. మొదటి సెమీ-ఫైనల్‌లో గ్రూప్ Aలో అగ్రస్థానంలో ఉన్న జట్టు మరొక గ్రూప్‌లో రెండవ స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. రెండవ సెమీ-ఫైనల్‌లో, గ్రూప్ Aలో రెండవ స్థానంలో ఉన్న జట్టు గ్రూప్ Bలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. అంటే న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు, ఓటములు కీలకం కానున్నాయి.
55
Champions Trophy 2025
న్యూజిలాండ్ పై ఇండియా గెలిస్తే...
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే, సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది, ఎందుకంటే ఈ విజయంతో టీమిండియా గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉంటుంది.
ఒకవేళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతే, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది, ఎందుకంటే ఓటమితో టీమిండియా గ్రూప్ ఏలో రెండవ స్థానంలో ఉంటుంది.