South Africa vs England, Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో 4వ, చివరి సెమీఫైనలిస్ట్ గా సౌతాఫ్రికా ఎంట్రీ ఇచ్చింది. తన గ్రూప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తుచేసిన సౌతాఫ్రికా గ్రూప్ బీ లో టాప్ లో నిలిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ చేరుకున్నాయి. ఇంగ్లాండ్ పై గెలుపుతో దక్షిణాఫ్రికా టాప్-4లో చోటు దక్కించుకుంది. గ్రూప్-బీలో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
ఏకపక్షంగా సాగిన సౌతాఫ్రికా-ఇంగ్లాండ్ మ్యాచ్
ఇంగ్లాండ్‌పై విజయంతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాలున్న ఇంగ్లాండ్ జట్టు ఒక్క విజయం కూడా అందుకోకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయింది. అలాగే, దక్షిణాఫ్రికా 4వ సెమీఫైనలిస్ట్ గా ఎంట్రీతో ఈ ఐసీసీ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం కూడా ముగిసింది.
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఈజీగానే విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పేలవమైన బ్యాటింగ్ తో 179 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మార్కో జాన్సెన్, ముల్డర్ లు చెరో 3 వికెట్లు తీసుకున్నారు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (72 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (64) అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా విజాయన్ని అందుకుంది.