ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మినీ వరల్డ్ కప్ గా గుర్తింపు పొందిన ఈ మెగా టోర్నీలు సత్తా చాటడానికి 8 జట్లు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్‌లో జరిగే ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఊహాగానాలు మొదలుపెట్టారు.
హైబ్రిడ్ మోడల్‌లో భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. చాలా మంది బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో వీళ్ళ ఫామ్, కన్సిస్టెన్సీ చూస్తే, ఈ టోర్నీలో పరుగుల వరద పారించే కొంత ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్‌కి అనుకూలం ఉంటే పాకిస్తాన్, దుబాయ్ పిచ్‌లపై ఐసీసీ టోర్నీ జరుగుతోంది. మరీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పరుగుల వరద పారించే లిస్టులో ఉన్న టాప్-5 ప్లేయర్ల వివరాలు మీకోసం.