Afghanistan vs South Africa: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ బీ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (103) తొలి వన్డే సెంచరీ, ఫాస్ట్ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో ప్రోటీస్ జట్టు విజయాన్ని అందుకుంది.
Afghanistan vs South Africa: ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన సెంచరీ, కగిసో రబాడ సూపర్ బౌలింగ్ ప్రదర్శనతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుచేసి దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని విజయంతో ప్రారంభించింది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది.
25
Image Credit: Getty Images
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ర్యాన్ రిక్లెటన్ అద్భుతమైన సెంచరీతో (103 పరుగులు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 315 పరుగులు చేసింది. గెలుపుకోసం పోరాటం చేసినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు 43.2 ఓవర్లలో 208 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ఈ జట్టు ఈ టోర్నమెంట్‌లో తొలిసారి ఆడుతోంది.
సౌతాఫ్రికా ఉంచి భారీ టార్గెన్ ను అందుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్‌కు మంచి ప్రారంభం అవసరం, కానీ దానికి అది లభించలేదు. రెండో ఓవర్ మూడో బంతికే విధ్వంసక బ్యాట్స్‌మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఔటయ్యాడు. అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఇబ్రహీం జద్రాన్ 17 పరుగులు, సెదికుల్లా అటల్ 16 పరుగులే చేసి ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ కష్టాలు పెరిగాయి. వరుసగా వికెట్లు పడుతుంటే మరో ఎండ్ లో రెహ్మత్ షా బ్యాట్ తో అర్ధ సెంచరీ సాధించాడు.
35
రెహ్మత్ షా చివరి క్రీజులో ఉన్నాడు కానీ, మరో ఎండ్ నుంచి అతనికి సహకారం లభించలేదు. కెప్టెన్ హస్మతుల్లా షాహిది 0, అజ్మతుల్లా ఒమర్జాయ్ 18, గుల్బాదిన్ నయీబ్ 13 పరుగులు మాత్రమే చేశారు. రషీద్ ఖాన్ అతనికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ కేశవ్ మహారాజ్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. నూర్ అహ్మద్‌ను వియాన్ ముల్డర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. జట్టు చివరి వికెట్‌గా రెహ్మత్ ఔటయ్యాడు. అతను 92 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 90 పరుగులు చేశాడు.
45
దక్షిణాఫ్రికా ఆల్ రౌండ్ షో
ఎడమ మోచేయి గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ దూరమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ రికిల్టన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ చారిత్రాత్మక సెంచరీ సాధించి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అతని సెంచరీతో ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా వారి రెండవ అత్యధిక స్కోరు 315 పరుగులను ఆఫ్ఘనిస్తాన్‌పై సాధించింది.
55
ర్యాన్ రికెల్టన్ 106 బంతుల్లో 103 పరుగులు చేసి తన వన్డే కెరీర్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ టెంబా బావుమా (58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (52), ఐడెన్ మార్క్రమ్ (50*) అర్ధ సెంచరీలు సాధించారు. రికిల్టన్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. కెప్టెన్ బావుమాతో కలిసి రెండవ వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. దురదృష్టవశాత్తూ 36వ ఓవర్‌లో రనౌట్ అయ్యాడు.