Champions Trophy: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం.. ఇంగ్లాండ్‌కు గుడ్ న్యూస్

Published : Feb 25, 2025, 06:41 PM IST

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండిలో భారీ వర్షం వల్ల టాస్ కూడా పడలేదు. 

PREV
12
Champions Trophy: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం.. ఇంగ్లాండ్‌కు గుడ్ న్యూస్

Champions Trophy  AUS vs SA: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షార్పణం అయింది. రావల్పిండిలో భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు.మంగళవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ కూడా వేయడానికి కుదరలేదు. రోజంతా వర్షం పడుతూనే ఉండటంతో మ్యాచ్ రద్దు చేశారు. దీంతో రెండు జట్లకు 1-1 పాయింట్ ఇచ్చారు. రెండు జట్లు బలంగానే ఉన్నాయి, అందుకే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ వర్షం దెబ్బకొట్టింది. సౌతాఫ్రికా మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై  గెలిచింది.

రెండు జట్లకు చావో రేవో మ్యాచ్

వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ చాలా ఆసక్తికరంగా మారింది. రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. సౌతాఫ్రికా 2 మ్యాచ్‌లలో 1 గెలిచి 3 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ +2.140గా ఉంది. దీంతో ఈ జట్టు టేబుల్ టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లలో 1 గెలిచి 3 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ +0.475గా ఉంది. ఇప్పుడు రెండు జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలి ఉంది. కాబట్టి ఏదో ఒక జట్టే 5 పాయింట్లు సాధించగలదు. అంటే రెండు జట్లకు రాబోబో గేమ్ చావో రేవో మ్యాచ్ అవుతుంది.

22

మ్యాచ్ రద్దుతో ఇంగ్లాండ్‌కు పెద్ద లాభమే

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు కావడంతో ఇంగ్లాండ్‌కు బాగా కలిసొచ్చింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. వాళ్లకు ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను ఓడిస్తే 4 పాయింట్లతో క్వాలిఫై అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ గ్రూప్‌లో చాలా ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories