Indian Flag Sparks Controversy In Lahore As Security Officials Detain Cricket Fan
పాక్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రతా సిబ్బంది చేసిన ఈ పని సమర్థనీయం కాదనీ, ఈ చర్యలు పాకిస్తాన్‌లో భారత్ పై లోతైన ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా మంది ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య విద్వేషపూరిత క్రికెట్ సంబంధాల గురించి చర్చలను మరింత తీవ్రతరం చేసింది.
భద్రత, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పాక్ చర్యలు
ఈ వివాదం టోర్నమెంట్‌లో పెరుగుతున్న భద్రతా సమస్యల్లో ఒకటిగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌కు సురక్షితమైన గమ్యస్థానంగా పాకిస్తాన్ తనను తాను తిరిగి స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇలాంటి సంఘటనలు దాని ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. కేవలం జెండా ప్రదర్శనకు దూకుడుగా స్పందించడం వల్ల విదేశీ అభిమానులు, ఆటగాళ్లు పాకిస్తాన్‌లో భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో ఎలా పాల్గొంటారు అనే విషయం మరిచిపోయినట్లుంది పాకిస్తాన్. భారత్-పాకస్తాన్ సంబంధాలు చారిత్రాత్మకంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు మరింత ఉద్రిక్తతలను పెంచవచ్చు. క్రీడాస్ఫూర్తిని దెబ్బకొడుతూ టోర్నీ ప్రారంభం రోజున టోర్నీలో పాల్గొనే దేశాలతో పాటు భారత జెండాను ఉంచకుండా విమర్శలు ఎదుర్కొన్న పాక్.. ఇప్పుడు మరోసారి జెండా పట్టుకున్నందుకు అభిమానిని స్టేడియం నుంచి లాక్కెళ్లడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సంబంధిత పూర్తి వీడియోలు ఇక్కడ చూడండి👇
1. పాక్ లో భారత జెండాతో క్రికెట్ అభిమాని
2. పాక్ స్టేడియంలో భారత జెండా పట్టుకున్న క్రికెట్ అభిమానిని లాక్కెళ్లారు