మీరెక్కడ దొరికార్రా బాబు... సూర్యకు రెస్ట్ ఇవ్వడం కూడా తప్పేనా! బీసీసీఐ, రాజకీయాలు చేస్తోందంటూ...

First Published Nov 24, 2022, 12:42 PM IST

2022 ఏడాదిలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇంగ్లాండ్‌ టూర్‌లో ఇంగ్లాండ్‌పై టీ20 సెంచరీ బాదిన సూర్య, తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో కివీస్‌పై సెంచరీ చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకి బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ... అయితే దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది...

Image credit: Getty

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఆ తర్వాత జరిగిన ప్రతీ సిరీస్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ టీమ్‌కి అందుబాటులో ఉన్నాడు. దీంతో అతనికి కాస్త బ్రేక్ అవసరమని భావించిన భారత క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ పర్యటనలో జరిగే వన్డే సిరీస్‌ నుంచి అతనికి విశ్రాంతి కల్పించింది...

Suryakumar Yadav

అయితే న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు... బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు. వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాప్ రోహిత్, కెఎల్ రాహుల్‌లకు బంగ్లాతో వన్డే సిరీస్‌లో చోటు ఇచ్చిన బీసీసీఐ, సూర్యకుమార్ యాదవ్‌కి మాత్రం ఎందుకు రెస్ట్ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు...

Suryakumar Yadav

ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌కి విశ్రాంతి అవసరం లేదని, సూర్యకుమార్ యాదవ్‌ని కావాలని సైడ్ చేసి బీసీసీఐ కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ ‘#Casteist_BCCI’ హ్యాష్‌ ట్యాగ్‌ని బీభత్సంగా ట్రెండ్ చేస్తున్నారు. ఎంత ఫామ్‌లో ఉన్నా, బ్రేక్ లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతూ పోతే ప్లేయర్లు అలిసిపోవడం కామన్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీసుల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అలాంటప్పుడు వరుస సిరీస్‌లు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి ఒక్క వన్డే సిరీస్ నుంచి బ్రేక్ ఇవ్వడం పెద్ద తప్పేమీ కాదు కూడా.. 30+ వయసులో ఉన్న సూర్యకి ఈ బ్రేక్ అవసరం కూడా..

Suryakumar Yadav

సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్, టి నటరాజన్ వంటి ప్లేయర్లు టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోవడానికి కుల రాజకీయాలే కారణమని ఆరోపణలు చేస్తున్నారు అభిమానులు.

Suryakumar Yadav

భారత క్రికెట్ బోర్డులో రాజకీయాలు జరిగే మాట వాస్తవమే... 110 కోట్ల మంది జనాభాలో నుంచి భారత జట్టు తరుపున ఆడేందుకు వస్తున్న 11 మందిలో ఎక్కువ భాగం అగ్రవర్ణాలు, కులాలదే... దీని గురించి ఎన్నో దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. ఇంకో శతాబ్దం గడిచినా ఇదే చర్చ ఉంటుంది.

Image credit: Getty

అయితే నిజమైన క్రికెట్ ఫ్యాన్స్‌ దృష్టిలో మాత్రం భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన తర్వాత కులం, మతం అనే తారతమ్యాలు ఉండవు. అందరూ భారత క్రికెటర్లే... ప్లేయర్లను ఐపీఎల్ టీమ్‌ల వారీగా విడదీసి చూసే అభిమానులు ఉన్న దేశంలో, కులాల వారీగా ప్లేయర్లను వేరు చేసి చూసేవాళ్లు ఉండడంలో ఆశ్రర్యం ఏమీ లేదు.

ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని జోన్‌లు, ఇన్ని ఐపీఎల్ టీమ్‌లు, ఇన్ని రంగులు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని వ్యత్యాలు ఉంటే... ప్రతీ దానిలోనూ తేడా కనిపిస్తూనే ఉంటుంది.

వరుసగా సిరీస్‌లు ఆడుతున్న సూర్యకు రెస్ట్ ఇవ్వడానికి కులమే కారణంగా చూపడాన్ని మాత్రం మూర్ఖత్వంగా పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరు... 

click me!