ఇది అతడికి గోల్డెన్ ఛాన్స్.. ఆడితే ప్రపంచకప్‌కు ఆడకుంటే ఇంటికి.. సారా అలీఖాన్ బాయ్‌‌ఫ్రెండ్‌పై సన్నీ కామెంట్స్

First Published Nov 24, 2022, 12:27 PM IST

INDvsNZ ODI: ఇండియా -న్యూజిలాండ్ మధ్య  రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ - 2023ను దృష్టిలో ఉంచుకుని  ఈ  సిరీస్ లలో కుర్రాళ్లు ఎలా ఆడతారనేది బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్  ఓ కన్నేసి ఉంచనున్నది. 

న్యూజిలాండ్ పర్యటనలో వర్షం కారణంగా  జరిగీ జరగనట్టుగా జరిగిన  టీ20 సిరీస్ ను హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్  దక్కించుకుంది.  అయితే ఈ సిరీస్ లో భారత్ కు ప్రయోగాలు చేసే అవకాశం రాలేదు. యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు వాతావరణం కూడా అనుకూలించలేదు. 

టీ20 సిరీస్ పోయినా వన్డే సిరీస్ మాత్రం అందుకు గొప్ప అవకాశం. టీ20లలో ఆడని  సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లతో పాటు యువ ఓపెనర్, బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తో  చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న  శుభమన్ గిల్ కు కివీస్ సిరీస్ కీలకం కానున్నది.  
 

పొట్టి సిరీస్ లో ఛాన్స్ రాకపోయినా శుభమన్ గిల్ కు వన్డే సిరీస్ లో  తప్పకుండా ప్లేస్ ఉంటుంది.  అదీగాక  రోహిత్, రాహుల్ లు లేనప్పుడు శిఖర్ ధావన్ తో కలిసి గిల్  వన్డేలలో ఓపెనర్ గా రాణిస్తున్నాడు. ఈ ఏడాదిలో వెస్టిండీస్, జింబాబ్వేతో పాటు దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా  గిల్ రాణించాడు. 

ఇక కివీస్ సిరీస్  లో గనక గిల్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే అతడు వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే  ప్రపంచకప్ లో  చోటు దక్కించుకోవడం ఖాయమని అంటున్నాడు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్.  కివీస్ సిరీస్  గిల్ కు గోల్డెన్ ఛాన్స్ అని సన్నీ అభిప్రాయపడ్డాడు. 
 

కివీస్ తో సిరీస్ కు ముందు ఓ వార్తా పత్రికకు రాసిన కాలమ్ లో సన్నీ.. ‘శుభమన్ గిల్  లో చాలా అరుదైన టాలెంట్ ఉంది. అది భారత జట్టుకు ప్రయోజనం చేకూర్చేదే. నాలుగేండ్ల క్రితం ఇదే న్యూజిలాండ్ పై  అండర్ -19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు (పృథ్వీ షా కెప్టెన్) లో అతడు కూడా సభ్యుడు. ఆ టోర్నీలో గిల్ రాణించడాని నాకు చాలా మంది చెప్పారు. 

అప్పటి అండర్ - 19 టీమ్ లో   అందరూ గిల్ గురించే మాట్లాడుకున్నారు. ఈ కుర్రాడు భవిష్యత్ లో ఇండియా తరఫున రాణిస్తాడని  నాకూ చెప్పారు.  అదృష్టవశాత్తూ అతడు ఐపీఎల్ లో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వచ్చే ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది.  ఈ టోర్నీలో  గిల్ ఆడాలని  నేను కోరుకుంటున్నా..’ అని  తెలిపాడు. 

ఇక గిల్ గురించి పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ దానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘టీమ్ మేనేజ్మెంట్ కూడా గిల్ ఆటను ప్రత్యేకంగా పరిశీలించవచ్చు. వన్డే ప్రపంచకప్ దృష్టిలో అతడికి ఈ సిరీస్ చాలా ముఖ్యం.  రోహిత్ శర్మకు  మంచి ప్లేయర్లు కావాలి..’అని చెప్పుకొచ్చాడు. 
 

click me!