రోహిత్ తర్వాత అతనే! దానికి ఎందుకు ఫీల్ అవ్వడం... కెప్టెన్సీపై శిఖర్ ధావన్ కామెంట్...

First Published Nov 24, 2022, 11:49 AM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జరిగిన జింబాబ్వే టూర్‌కి ముందుగా శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. అయితే కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో అనుకోకుండా ఆఖరి నిమిషంలో కెప్టెన్సీ మార్పు జరిగింది. కెఎల్ రాహుల్ రీఎంట్రీతో శిఖర్ ధావన్ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది...

గాయం కారణంగా రెండు నెలల పాటు టీమ్‌కి దూరమైన కెఎల్ రాహుల్‌, ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని జింబాబ్వే టూర్‌కి పంపించింది బీసీసీఐ. అయితే టీమిండియాలో సీనియర్ మోస్ట్ ఓపెనర్‌గా ఉన్న శిఖర్ ధావన్‌ని తప్పించి, కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించడం తీవ్ర వివాదాస్పదమైంది...

ప్రాక్టీస్ కావాలంటే ప్లేయర్‌గా ఆడిస్తే సరిపోతుందని, కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పేరును ప్రకటించిన తర్వాత ఎందుకు తొలగిస్తారని తీవ్ర స్థాయిలో బీసీసీఐ తీరుపై విమర్శలు చేశారు అభిమానులు. గబ్బర్‌ని బీసీసీఐ అవమానించిందంటూ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వచ్చింది...
 

‘టీమిండియాకి కెప్టెన్సీ చేయడం నాకు దక్కిన గౌరవం. అదీ ఈ వయసులో టీమిండియాని నడిపించే బాధ్యత దక్కడం చాలా పెద్ద విషయం. ఇది నాకు ఓ ఛాలెంజ్ లాంటిది. కుర్రాళ్లతో టీ20 సిరీస్ గెలిచాం.. వన్డే సిరీస్‌లోనూ ఇదే రిజల్ట్ రిపీట్ చేయాలని ఆశపడుతున్నాం...
 

Shikhar Dhawan

జింబాబ్వే టూర్‌ గురించి మాట్లాడితే కెఎల్ రాహుల్, టీమిండియాకి వైస్ కెప్టెన్. రోహిత్ శర్మ లేకపోతే అతనే కదా కెప్టెన్‌గా ఉండాలి. రాహుల్ టీమ్‌లో ఉన్నప్పుడు వేరే వాళ్లను కెప్టెన్‌గా నియమించడం కరెక్ట్ కాదు...

కెఎల్ రాహుల్, ఆసియా కప్‌కి వెళ్లాలి. ఒకవేళ ఆసియా కప్‌లో అయినా రోహిత్ శర్మ గాయపడితే, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే టీమిండియా ఆడాలి. కాబట్టి అతనికి బ్యాటింగ్ ప్రాక్టీస్‌కి మాత్రమే కాదు, కెప్టెన్సీ ప్రాక్టీస్‌కి కూడా జింబాబ్వే టూర్ ఉపయోగపడింది.

Image credit: PTI

ఆ విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. అందుకే లాస్ట్ మినెట్‌లో నన్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు చెప్పినా నేను ఫీల్ కాలేదు. ఏం జరిగినా టీమ్‌‌కి మంచి జరిగితే చాలు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి నాకు కెప్టెన్సీ ఇచ్చారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు నాకు అండగా నిలుస్తున్నారు. నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది...’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్...

click me!