స్టేడియంలో వాటిని ఏరేసిన రాహుల్ ద్రావిడ్... టీమిండియా హెడ్‌కోచ్‌పై సౌరవ్ గంగూలీ...

First Published Dec 12, 2021, 6:29 PM IST

రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్, శుభారంభం చేశాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో చేజిక్కించుకుంది...

తాత్కాలిక హెడ్ కోచ్‌గా శ్రీలంక టూర్‌లో రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రాణా, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి వంటి ఎందరో యువ క్రికెటర్లను ఆరంగ్రేటం చేయించాడు రాహుల్ ద్రావిడ్...

అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా శ్రేయాస్ అయ్యర్, టీ20 సిరీస్ ద్వారా వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ వంటి ఐపీఎల్ స్టార్లకు అవకాశం దక్కింది...

ఐదు రోజుల పాటు పూర్తిగా సాగిన కాన్పూర్ టెస్టులో భారత జట్టు... ఆఖరి సెషన్‌లో ఆఖరి అరగంట ఆఖరి వికెట్ తీయలేక డ్రాగా ముగించుకున్న విషయం తెలిసిందే...

‘సౌతాఫ్రికా పర్యటన, రాహుల్ ద్రావిడ్‌కి హెడ్ కోచ్‌గా ఇదే తొలి ఫారిన్ టూర్. అందుకు ఆయనకి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నా... అయితే ఆయన ఇప్పటికే టీమిండియాపై తన మార్కు చూపించారు.

కాన్పూర్ టెస్టులో రాహుల్ ద్రావిడ్ చేసిన పని మీకు చెప్పాలి... ప్రాక్టీస్ ముగిసిన తర్వాత సాయంత్రం సమయాల్లో స్టేడియంలో ఉన్న కోన్స్, వికెట్లు, బాల్స్ ఏరి... తనతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకొచ్చేవాడట రాహుల్ ద్రావిడ్...

రాహుల్ ద్రావిడ్ ఆ పని చూస్తుంటే కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్స్ ఎంతో ఆశ్చర్యంగా ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించడానికి పోటీ పడి ఉండొచ్చు...

ఆయన చాలా మానసిక పరిణతి కలిగిన వ్యక్తి. ప్లేయర్లకు మానసిక, శారీరక సమస్యలను కూడా ఇట్టే తెలుసుకుంటారు. అందుకే రాహుల్ ద్రావిడ్‌ను బ్రతిమిలాడి మరీ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించాం...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

కాన్పూర్ టెస్టు ముగిసిన తర్వాత ఎవరికి అడ్వాంటేజ్ కాకుండా కరెక్ట్ టెస్టు పిచ్ తయారుచేసినందుకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్,  క్యూరేటర్‌కి తన సొంత ఖర్చుల నుంచి రూ.35 వేలు అందించిన విషయం తెలిసిందే.

click me!