తీగ మళ్లీ కదిలింది... కామెరూన్ బాంక్రాఫ్ట్ వ్యాఖ్యలతో ‘బాల్ టాంపరింగ్’ ఇష్యూని మళ్లీ విచారించనున్న సీఏ...

First Published May 16, 2021, 1:35 PM IST

మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టులో అల్లకల్లోలం సృష్టించిన ‘బాల్ టాంపరింగ్’ వివాదానికి మరోసారి తెరలేచింది. ‘బాల్ టాంపరింగ్’ వివాదంలో ఇరుక్కుని, 8 నెలల పాటు బ్యాన్‌కి గురైన క్రికెటర్ కామెరూన్ బాంక్రాఫ్ట్... ఆ స్కామ్‌ గురించి బౌలర్లకు కూడా తెలుసని చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం...

‘2018 కేప్‌టౌన్ టెస్టు గురించి ఎవరు ఎలాంటి నూతన సమాచారం ఇచ్చినా, వాటిని పరిగణనలోకి తీసుకుని విచారణ తీసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంది. వాళ్లొచ్చి మా ముందు తమ వాగ్వాదాన్ని వినిపిసతే, మరోసారి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం...’ అంటూ తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా.
undefined
దీంతో ఆస్ట్రేలియా జట్టును మరోసారి ‘సాండ్ పేపర్’ బాల్ టాంపరింగ్ ఇష్యూ వణికిస్తోంది. ఒకవేళ కామెరూన్ బాంక్రాఫ్ట్, ఆ రోజు బాల్ టాంపిరింగ్‌ గురించి బౌలర్లకు కూడా పూర్తి సమాచారం తెలుసని తాను చేసిన వ్యాఖ్యలను క్రికెట్ ఆస్ట్రేలియా ముందు బలంగా వినిపిస్తే, ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హజల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్‌లపై కూడా సీఏ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
undefined
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ‘సాండ్ పేపేర్ - బాల్ ట్యాంపరింగ్’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా జట్టుపై ‘ఛీటర్స్’ అనే ముద్ర వేసిందీ సంఘటన. ఈ వివాదంలో పాలుపంచుకుని, నిషేధానికి గురైన ప్లేయర్ కామెరూన్ బాంక్రాఫ్ట్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి..
undefined
2018లో సౌతాఫ్రికా టూర్‌లో సాండ్ పేపర్‌తో ‘బాల్ టాపరింగ్‌’కి పాల్పడ్డింది ఆసీస్ టీమ్. ఈ సంఘటన మొత్తం కెమెరాల్లో రికార్డు కావడంతో సాండ్ పేపర్ ప్యాంటులో దాచుకున్న కామెరూన్ బాంక్రాఫ్ట్‌తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై సస్పెషన్ విధించింది ఐసీసీ...
undefined
‘ఆ సంఘటనలో నేను చేసినదానికి, నావంతు భాగం మోసానికి నేను బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నా. అందుకే నేను నా తప్పుని అంగీకరించాను. అయితే నేను చేసింది నా కోసం కాదు కదా... నేనేం చేశానో, అది బౌలర్లకు అనుకూలించే విషయం. సాండ్ పేపర్‌తో రుద్దితే బంతి, ఎలా స్పందిస్తుందో అప్పటి బౌలర్లకు కూడా బాగా తెలుసు. కానీ వారికి ఎలాంటి శిక్ష పడలేదు...
undefined
ఇప్పటిదాకా నాకు జరిగిన విషయాలన్నీ తలుచుకుంటే, నేను చేసిన మోసాన్ని ఒప్పుకుని, తప్పుచేశానేమో అనిపిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతుందని ముందే ఊహించి ఉంటే, నేను ఇంకా మంచి నిర్ణయం తీసుకునేవాడిని...’ అంటూ చెప్పుకొచ్చాడు 28 ఏళ్ల కామెరూన్ బాంక్రాఫ్ట్...
undefined
సాండ్ పేపర్ వివాదం తర్వాత అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు ఏడాది పాటు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ ఆడకుండా 12 నెలల నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా, బాంక్రాఫ్ట్‌పై 9 నెలల బ్యాన్ విధించింది.అప్పటికి 10 మ్యాచులు ఆడిన కామెరూన్ బాంక్రాఫ్ట్... 446 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత సంఘటన తర్వాత కామెరూన్ బాంక్రాఫ్ట్‌కి మళ్లీ జట్టులో అవకాశం దక్కలేదు.
undefined
కెప్టెన్, వైస్ కెప్టెన్, సాండ్ పేపర్‌ను ప్యాంటులో దాచుకున్న కామెరూన్ బాంక్రాఫ్ట్‌లపై నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా, సాండ్ పేపర్‌తో రుద్దిన బంతిని వాడిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్‌వుడ్ వంటి బౌలర్లకు మాత్రం బాల్ టాంపరింగ్‌ గురించి తెలియదంటూ కొట్టిపారేసింది.
undefined
సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ కేసులో నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నప్పటికీ కామెరూన్ బాంక్రాప్ట్‌కి మాత్రం ఆ ఇష్యూ తర్వాతి తిరిగి జట్టులో చోటు దక్కలేదు.
undefined
click me!