టెస్టు కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా! వన్డే, టీ20లకు ఆ ఇద్దరూ బెటర్... రాబిన్ ఊతప్ప కామెంట్...

Published : Jul 27, 2022, 01:24 PM IST

టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే పేరుకి పూర్తి స్థాయి కెప్టెన్ అయినా, రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక ఏడు నెలల్లో ఏడుగురు కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది. దీంతో రోహిత్ శర్మ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమేననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి...

PREV
18
టెస్టు కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా! వన్డే, టీ20లకు ఆ ఇద్దరూ బెటర్... రాబిన్ ఊతప్ప కామెంట్...

35 ఏళ్ల రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకుంటే టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ కారణంగా టీమిండియా కెప్టెన్సీ రేసులో ఒకటికి నలుగురు ప్లేయర్లు నిలిచారు...
 

28

తాజాగా భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు...
 

38

‘జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు సెట్ అయ్యే సరైన కెప్టెన్. అతనిలో చాలా మంచి కెప్టెన్ ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కి తగిన వ్యూహాలు చేస్తూ టీమిండియాకి మంచి విజయాలు అందించగలడు...

48

వన్డే, టీ20లకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా సెట్ అవుతాడు. అలాగే కెఎల్ రాహుల్ కూడా మంచి కెప్టెన్. అతను రోజురోజుకీ మరింత మెరుగవుతున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప...

58

కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ కూడా సౌతాఫ్రికాపైనే కెప్టెన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కెఎల్ రాహుల్, సౌతాఫ్రికా టూర్‌లో వన్డే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే రాహుల్ కెప్టెన్సీలో మూడు వన్డేల్లోనూ చిత్తుగా ఓడి, క్లీన్ స్వీప్ అయ్యింది భారత జట్టు...
 

68
Image credit: PTI

ఆ తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా కెఎల్ రాహుల్‌నే కెప్టెన్‌గా ఎంచుకుంది బీసీసీఐ. అయితే గాయం కారణంగా అతను తప్పుకోవడంతో కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కి ప్రమోషన్ దక్కింది...

78

కెప్టెన్‌గా మొదటి రెండు టీ20ల్లో ఓడినా, ఆ తర్వాత రెండు టీ20ల్లో విజయాలు అందుకున్నాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికాని స్వదేశంలో రెండు టీ20ల్లో ఓడించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్..

88

36 ఏళ్ల రాబిన్ ఊతప్ప, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా తరుపున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని, కేవలం ఆడినన్ని రోజులు క్రికెట్‌ని ఎంజాయ్ చేయాలని మాత్రమే అనుకుంటున్నానని పేర్కొన్నాడు...

Read more Photos on
click me!

Recommended Stories