మురళీ విజయ్‌‌ ముందు ‘డీకే’ అంటూ అరుపులు... చేతులు ఎత్తి వేడుకున్నా వినని ఫ్యాన్స్...

Published : Jul 27, 2022, 11:23 AM IST

38 ఏళ్ల వయసులో తమిళనాడు ప్రీమియన్ లీగ్‌లో పాల్గొంటున్న సీనియర్ భారత క్రికెటర్ మురళీ విజయ్‌కి వింత అనుభవం ఎదురైంది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మురళీ విజయ్‌ని ‘డీకే... డీకే’ అని అరుస్తూ ఎగతాళి చేశారు క్రికెట్ ఫ్యాన్స్... చేతులు జోడించి వేడుకున్నా, వినకుండా అలా అరుస్తూనే ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది...  

PREV
19
మురళీ విజయ్‌‌ ముందు ‘డీకే’ అంటూ అరుపులు... చేతులు ఎత్తి వేడుకున్నా వినని ఫ్యాన్స్...

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత వేలంలో అమ్ముడుపోని మురళీ విజయ్, కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్‌కి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే రీఎంట్రీ కోసం తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో రూబీ త్రిచీ వారియర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు ఈ భారత మాజీ ఓపెనర్...

29

బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మురళీ విజయ్‌ని ‘డీకే.. డీకే...’ అంటూ అరుస్తూ ఏడిపించారు తమిళనాడు క్రికెట్ ఫ్యాన్స్. అభిమానులకు కేకలకు తొలుత చప్పట్లతో అభినందించిన మురళీ విజయ్, వాళ్లు ఎంతకీ తగ్గకపోవడంతో చేతులు జోడించి నమస్కరించి, ఎందుకిలా చేస్తున్నారంటూ సైగలతో అసహనం వ్యక్తం చేశాడు..

39

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళీ టోర్నీల్లో తమిళనాడు టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహారించే దినేశ్ కార్తీక్, 21 ఏళ్ల వయసులో 2007లో చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు...

49

నికితా తండ్రి, దినేశ్ కార్తీక్ వాళ్ల తండ్రి ఇద్దరూ స్నేహితులు కావడంతో ఈ ఇద్దరూ కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్‌గా ఉన్న మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు.

59

స్నేహితుడైన దినేశ్ కార్తీక్ ఇంటికి తరుచుగా వెళ్లి వస్తుండేవాడు మురళీ విజయ్. అలా నికితాకి దగ్గరైన మురళీ విజయ్, స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కార్తీక్ ఇంట్లో లేని సమయంలోనూ మురళీ విజయ్ అతని ఇంట్లోనే ఉండేవాడు. ఈ విషయం దినేశ్ కార్తీక్‌కి తప్ప తమిళనాడు జట్టు ప్లేయర్లందరికీ తెలుసు...

69

2012లో తమిళనాడు విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్‌కి, మురళీ విజయ్‌కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది... 

79

భార్య తనను మోసం చేసిందన్న బాధకంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేశ్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నికితాకి విడాకులు ఇచ్చేశాడు.  దినేశ్ కార్తీక్‌కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. దీంతో ఆ బిడ్డకు తానే తండ్రినని తెలుసుకున్న మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

89

ఇప్పుడు నికితా, మురళీ విజయ్‌లకు ముగ్గురు పిల్లలు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళీ విజయ్, దినేశ్ కార్తీక్... ఈ సంఘటన తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయారు. దినేశ్ కార్తీక్‌తో మాట్లాడడానికి కానీ ముఖం చూపించడానికి కానీ మురళీ విజయ్ సాహసించడు. 

99

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి దినేశ్ కార్తీక్, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ స్టోరీ... విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో దినేశ్ కార్తీక్‌కి విపరీతమైన సపోర్ట్ దక్కుతోంది. అదే టైమ్‌లో మురళీ విజయ్‌ని ఇలా ఎగతాళి చేస్తూ వేధిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories