మరో మూడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్, టీ20 వరల్డ్ కప్ 2022 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని పెద్దగా అంచనాలు లేకుండా ప్రారంభించింది ఆస్ట్రేలియా. వార్మప్ మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా, లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి, సెమీస్‌లో చెలరేగి... ఫైనల్‌లో ఘన విజయాన్ని అందుకుంది...
28
2021లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి పొట్టి ప్రపంచకప్‌కి వేదికనిస్తుండడంతో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో ఆసీస్ వరుసగా రెండో టైటిల్ గెలవడం గ్యారెంటీ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
38
టైటిల్ ఫెవరెట్‌గా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి పాక్ చేతుల్లో పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లో ఓడి సెమీస్‌కి అర్హత సాధించలేకపోయింది...
48
‘ఈసారి నా అంచనా ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఫైనల్ ఆడతాయి. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియా, టీమిండియాని ఓడించి టైటిల్ గెలుస్తుంది...
58
ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా టోర్నీని మొదలెట్టడమే కాదు, ఆస్ట్రేలియాకి ఈసారి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో ఫైనల్ ఆడుతున్నామనే ఒత్తిడి చాలు, ఇండియాని ఫైనల్‌లో ఓడించడానికి...
68
యూఏఈకి వేదికను మార్చినప్పుడు అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు ఆస్ట్రేలియాకి అనుకూలించవని అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నా... అయితే ఆసీస్ అన్నింటినీ అధిగమించి టైటిల్ గెలిచింది...
78
వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు వైట్ బాల్ క్రికెట్‌లో చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వాళ్లకు వైట్ బాల్ ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు... వాళ్లకి కూడా ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది...
88
T20 world Cup
వాళ్లని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్‌లో మోస్ట్ క్లాస్, మోస్ట్ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...