ఆ సంఘటన తర్వాత క్రికెట్‌పై అసహ్యం పుట్టింది... బెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్...

First Published Aug 23, 2022, 5:06 PM IST

బెన్ స్టోక్స్... క్రికెట్ ప్రపంచంలో స్టార్ ఆల్‌రౌండర్. జో రూట్ నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్ స్టోక్స్, కెప్టెన్‌గానూ అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్... తనకు క్రికెట్‌పై అసహ్యం పుట్టిందనిి షాకింగ్ కామెంట్స్ చేశాడు...

2019 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్, ఐపీఎల్ 2022 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు...

Ben Stokes

బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్, అనారోగ్యంతో బాధపడుతూ 2020, డిసెంబర్‌లో ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడిన గెరార్డ్ జేమ్స్, 65 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీసినా, సెంచరీ చేసినా చేతులతో తండ్రికి అభివాదం చేసేవాడు బెన్ స్టోక్స్...

క్యాన్సర్ బారిన పడిన తండ్రికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియాతో, పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లకు దూరంగా ఉన్న బెన్ స్టోక్స్... ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా ఆలస్యంగా వచ్చాడు... ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత కొన్నిరోజులకే గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ మరణించాడు...

‘ఆఖరి రోజుల్లో మా నాన్నకి తోడుగా ఉండాలని అనుకున్నా. అయితే తను మాత్రం నేను క్రికెట్ ఆడుతుంటే చూడాలనుకున్నారు. ఆయన చనిపోయిన విషయం తెలిసినా బయో బబుల్ నిబంధనల కారణంగా ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా నోచుకోలేకపోయాను... అప్పటి నుంచే నాకు క్రికెట్ అంటే విరక్తి, అసహ్యం మొదలయ్యాయి...’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్...

Ben Stokes

తండ్రి మరణించిన తర్వాత 2021లో టీమిండియాతో సిరీస్ ఆరంభానికి ముందు మెంటల్ హెల్త్ కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ కూడా ఆడని బెన్ స్టోక్స్... యాషెస్ సిరీస్ ముందు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు...

యాషెస్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బెన్ స్టోక్స్, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఇంగ్లాండ్‌కి వరుసగా నాలుగు విజయాలు అందించాడు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడింది.. 

click me!