శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో పోరాడగా చివర్లో శివమ్ మావి బ్యాటుతోనూ మంచి పర్ఫామెన్స్ చూపించాడు. అయితే 207 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టాపార్డర్ వైఫల్యం టీమిండియాని తీవ్రంగా ప్రభావితం చేసింది...
శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. వీరిలో హార్ధిక్ పాండ్యా తప్ప మిగిలిన ముగ్గురూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు...
27
arshdeep
అయితే బౌలింగ్‌లో టీమిండియా చేసిన పొరపాట్లకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా జ్వరంతో బాధపడుతూ తొలి టీ20కి దూరమైన అర్ష్‌దీప్ సింగ్, రెండో టీ20లో హర్షల్ పటేల్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చాడు...
37
రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి చెరో నో బాల్స్ వేయడంతో టీమిండియా ఏకంగా 7 నో బాల్స్ సమర్పించింది. ఈ నో బాల్స్, ఫ్రీ హిట్స్ ద్వారా శ్రీలంక స్కోరులో 30+ పరుగులు అదనంగా చేరాయి...
47
Team India vs sri lanka
‘పవర్ ప్లేలు మాకు కలిసి రాలేదు. బౌలింగ్ పవర్ ప్లేలో అధికంగా పరుగులు ఇచ్చాం. బ్యాటింగ్ పవర్ ప్లేలో కీలక వికెట్లు కోల్పోయాం. మేం చాలా తప్పులు చేశాం. కొన్ని సార్లు ఎక్కువ పరుగులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే బేసిక్స్ కూడా మరిచిపోయేంత చెత్త ప్రదర్శన అయితే ఊహించలేదు...
57
india vs sl
ఇంతకుముందు మ్యాచుల్లో కూడా మేం నో బాల్స్ వేశాం. అయితే మరీ ఇంత దారుణంగా ఎప్పుడూ వేయలేదు. ఎవ్వరినీ నిందించడం లేదు కానీ టీ20ల్లో నో బాల్స్ వేయడం నేరం... అర్ష్‌దీప్ సింగ్ రిథమ్ అందుకోవడానికి సమయం తీసుకుంటాడని అనుకోలేదు...
67
రిథమ్ లేకుండా ఆడడం వల్ల ఇలాంటి ఫలితాలే వస్తాయి. అతను కమ్‌బ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాం. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా సెటిల్ అయ్యాడు.
77
Image credit: PTI
సూర్యను తన ప్లేస్ నుంచి జరపడం కరెక్ట్ కాదు. కొత్త వాళ్లు ఎవరొచ్చినా వేరే స్థానాల్లో ఆడాల్సిందే.. అందుకే రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..