విరాట్ తలుచుకుంటే అది చేయగలడు! ధోనీ వల్ల కూడా కాలేదు... గౌతమ్ గంభీర్ కామెంట్..

First Published Jan 5, 2023, 8:20 PM IST

కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో అత్యధిక విజయాల శాతం అందుకున్న సారథిగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడాలనుకున్నాడు. కానీ కుదర్లేదు...

Image credit: Getty

బీసీసీఐ, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం... భారత క్రికెట్‌ని అతలాకుతలం చేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న తర్వాతి సిరీస్‌లోనే టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ.రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌, గాయాలతో పాటు రెస్ట్ తీసుకుంటూ చాలా సిరీస్‌లకు దూరంగా ఉంటున్నాడు...

2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ధోనీ, యువరాజ్ వంటి ప్లేయర్లు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్‌లో సభ్యులుగా ఉన్నా.. రెండు వన్డే వరల్డ్ కప్స్ గెలవలేకపోయారు...

‘రెండు వరల్డ్ కప్స్ గెలవడం కంటే గొప్ప అఛీవ్‌మెంట్ ఉండదు. చాలా తక్కువ మంది ప్లేయర్లు మాత్రం రెండు వరల్డ్ కప్స్ సాధించారు. విరాట్ కోహ్లీ ముందు ఆ రికార్డు వేచి ఉంది...

Image credit: Getty

వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీ చాలా కీలక పాత్ర పోషించబోతున్నాడు. భారత క్రికెటర్లు ఎవ్వరూ రెండు వన్డే వరల్డ్ కప్స్ గెలవలేదు.

విరాట్‌కి ఆ ఘనత సాధించే అవకాశం ఉంది.  అతను తలుచుకుంటే టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

click me!