బుమ్రానే మించిపోయిన అర్ష్‌దీప్ సింగ్... 10 బంతుల్లో 5 నో బాల్స్‌తో చెత్త రికార్డు...

First Published Jan 5, 2023, 10:00 PM IST

అర్ష్‌దీప్ సింగ్.. టీమిండియాకి ఆశాకిరణంగా కనిపించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్. జహీర్ ఖాన్ తర్వాత సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం వెతుకుతున్న టీమిండియాకి అర్ష్‌దీప్ సింగ్ సరైనోడిలా కనిపించాడు.ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్‌లోనూ చక్కగా బౌలింగ్ చేసి మెప్పించాడు...

భువనేశ్వర్ కుమార్ ఫెయిల్ అయిన మ్యాచుల్లో అర్ష్‌దీప్ సింగ్ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో 10 వికెట్లు తీసి టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

టీమిండియాకి ఆశాకిరణంగా మారుతున్న అర్ష్‌దీప్ సింగ్, శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్, వరుసగా మూడు నో బాల్స్ వేసి 19 పరుగులు సమర్పించాడు...

Image credit: Getty

ఒకే ఓవర్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా నిలిచిన అర్ష్‌దీప్ సింగ్, రెండో ఓవర్‌లో మరో రెండు నో బాల్స్ వేశాడు. మొత్తంగా 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్, 5 నో బాల్స్ వేసి.. టీమిండియా తరుపున ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు...

Arshdeep Singh

2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించిన అర్ష్‌దీప్ సింగ్, 2 ఓవర్లు బౌలింగ్‌ చేసి అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు అశ్విన్ 2 ఓవర్లలో 41 పరుగులు ఇవ్వగా రవీంద్ర జడేజా 38 పరుగులు ఇచ్చాడు.... ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనే ఈ ఫీట్లు సాధించారు.

arshdeep

2022లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఒకే ఏడాదిలో 12 నో బాల్స్ వేశాడు. టీమిండియా తరుపున ఇదే అత్యధికం. మోర్నీ మోర్కెల్ 19, బ్రెట్ లీ 17 నో బాల్స్ వేసి టాప్‌లో ఉంటే భారత బౌలర్లు ఎవ్వరూ టీ20ల్లో 12 నో బాల్స్ వేయలేదు..

Image credit: Getty

మరీ విచిత్రమైన విషయం ఏంటంటే 2022 జనవరి నుంచి ఏడాది కాలంలో భారత మిగిలిన బౌలర్లు అందరూ కలిసి 11 నో బాల్స్ వేస్తే, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 12 నో బాల్స్ వేశాడు. అయితే ప్రాక్టీస్ లేకపోవడం వల్లే అర్ష్‌దీప్ సింగ్ ఇలా బౌలింగ్ చేశాడని కామెంట్ చేశాడు దినేశ్ కార్తీక్..

Image credit: PTI

‘అర్ష్‌దీప్ సింగ్ జ్వరంతో ప్రాక్టీస్‌కి దూరంగా ఉన్నాడు. జ్వరం నుంచి కోలుకుని నేరుగా మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. ఏ బౌలర్‌కి అయినా ప్రాక్టీస్ లేకపోతే రిథమ్ అందుకోవడం కష్టం. ఒక్క మ్యాచ్‌ కారణంగా అర్ష్‌దీప్ సింగ్ టాలెంట్‌ని తక్కువ అంచనా వేయకూడదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్.. 

click me!