చేసేది తక్కువైనా, చెప్పడానికి ఎంతో ఉంటుంది పాక్ ప్లేయర్ల దగ్గర... భారత జట్టుపై, బీసీసీఐపై, ఐపీఎల్‌పై పడి ఏడిచే పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా... టీమిండియాలో కలిసి నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు...
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి ఉండే క్రేజ్ వేరే లెవెల్.. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు, బుకింగ్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి...
28
ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా, పైకి బడాయి పోతున్న పాకిస్తాన్ జట్టు... భారత జట్టుతో మ్యాచులు ఆడి, ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది...
38
ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో కలిసి నాలుగు దేశాల సిరీస్ నిర్వహించాల్సిందిగా ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు ప్రపోజల్ కూడా పెట్టింది...
48
అయితే బీసీసీఐ మాత్రం పాకిస్తాన్‌తో కలిసి సిరీస్ ఆడేందుకు ససేమీరా అంటోంది. పాక్‌తో తిరిగి క్రికెట్ ఆడాలంటే అనేక విషయాలపై ఆధారపడాల్సి ఉంటుందని కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...
58
మార్చి 19న దుబాయ్ వేదికగా జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మీటింగ్‌లో ఈ విషయం గురించి భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చిస్తానని అంటున్నాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...
68
‘దుబాయ్‌లో జరిగే ఏసీసీ మీటింగ్‌లో సౌరవ్ గంగూలీతో ఈ విషయం గురించి మాట్లాడాను. మనమిద్దం మాజీ కెప్టెన్లం, క్రికెటర్లం... మనవరకీ క్రికెట్‌తో రాజకీయాలకు సంబంధం లేదని వివరిస్తా...
78
ఒకవేళ నా ప్రపోజల్‌కి ఇండియా అంగీకరించకపోతే, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో త్రైపాక్షిక సిరీస్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తాం...
88
వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు వస్తుందనే అనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు ఇక్కడికి రాకపోతే ఏం చేయగలమో అప్పుడు ఆలోచిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు రమీజ్ రాజా...