భయపడేది లేదు! అది మన హక్కు... మొదటి రోజు నుంచే వాళ్లకు చుక్కలు కనిపించాలి! - రవిశాస్త్రి

First Published Feb 7, 2023, 12:51 PM IST

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించడం వెనకాల అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి పాత్ర కూడా చాలా ఉంది. కుమ్మేద్దామంటే, పద పొడిచేద్దాం అని ఆలోచించే ఈ ఇద్దరూ, దూకుడైన యాటిట్యూడ్‌తో టీమిండియాని టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో నిలబెట్టారు... ప్రస్తుతం కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిశాస్త్రి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చేశాడు. అయినా అజింకా రహానే కెప్టెన్సీలో, హెడ్ కోచ్ రవిశాస్త్రి సారథ్యంలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 32 ఏళ్లుగా ఆసీస్‌కి కంచుకోటగా మారిన గబ్బాలో అదిరిపోయే దెబ్బ తీసి, ఆస్ట్రేలియాని అబ్బా... అనిపించింది...

Image credit: Getty

ఎప్పటిలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియా మెంటల్ గేమ్ మొదలెట్టింది. ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ, టీమిండియా సరైన పిచ్ తయారుచేస్తే ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై స్పందించాడు రవిశాస్త్రి...

Ravi Shastri and Virat Kohli

‘ఇయాన్ హీలీ ఏమన్నాడు, పిచ్ సరిగా తయారుచేస్తే ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్ ఉంటుందనేగా.. గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియానే పిచ్‌లు తయారుచేసింది. అప్పుడు మ్యాచులన్నీ ఆస్ట్రేలియాలోనే జరిగాయి. ఇప్పుడు వాళ్లు ఇండియాలో ఆడుతున్నారు...

ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. మొదటి రోజు నుంచే బాల్ టర్న్ అవ్వాల్సిందే. టాస్ ఓడిపోయినా పర్లేదు, స్పిన్ పిచ్‌పై ఆడడం మనవాళ్లకు కొత్తేమీ కాదు. మొదటి సెషన్‌లో త్వరగా వికెట్లు పడినా రెండో సెషన్‌లో కోలుకుంటారు. మన బలం అదే...

స్వదేశంలో ఆడుతున్నప్పుడు అన్ని అస్త్రాలను వాడుకోవాలి. ఎవరో ఏదో అన్నారని, ఇంకేదో అనుకుంటారని పిచ్‌ని మార్చాల్సిన పని లేదు.. ఆస్ట్రేలియా, స్వదేశంలో వరుసగా సిరీస్‌లు గెలిచింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది...
 

ఆస్ట్రేలియా విజయాల్లో ఎక్కువ స్వదేశంలోనే వచ్చాయి. భారత్ దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటే తప్పేంటి. ఆస్ట్రేలియన్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ప్రతీసారి గెలుస్తామనే ధీమాతో ఇక్కడికి వస్తారు. తక్కువ స్కోరుకి ఆలౌట్ అయిపోతే... వెంటనే పిచ్ బాలేదని ఎడవడం మొదలెడతారు... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!