ఎమ్మెస్ ధోనీ చేసిన ఆ పనికి బాగా ఫీలైన లతా మంగేష్కర్... 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన...

Published : Feb 06, 2022, 08:13 PM IST

సంగీత ప్రియులను తన మధుర స్వరంలో జోలలాడించిన ‘గాన కోకిల’ లతా మంగేష్కర్, ఇక సెలవంటూ అనంత లోకాలకు కదిలివెళ్లింది. సినీ సంగీత రంగంతోనే కాదు, క్రికెట్ ప్రపంచంతో కూడా లతా మంగేష్కర్‌కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది.  

PREV
111
ఎమ్మెస్ ధోనీ చేసిన ఆ పనికి బాగా ఫీలైన లతా మంగేష్కర్... 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన...

సప్త స్వరాల మధ్య జీవితాన్ని గడిపిన లతా మంగేష్కర్, కాలక్షేపం కోసం క్రికెట్ మ్యాచులను ఇష్టంగా చూసేవారు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ అంటే ఆమెకి ప్రత్యేకమైన అభిమానం. సచిన్ టెండూల్కర్‌తో లతా మంగేష్కర్‌కి ఆత్మీయ అనుబంధం కూడా ఉంది...

211

లతా మంగేష్కర్ మరణవార్త తెలుసుకున్న సచిన్ టెండూల్కర్, ఆసుపత్రికి వెళ్లి ఆమెకి కన్నీటి వీడ్కోలు పలికారు. సచిన్‌తో తరుచుగా మాట్లాడే లతా మంగేష్కర్, భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఆటను ఎంతగానో ఇష్టపడేవారు... 

311

సచిన్ టెండూల్కర్ దగ్గర్నుంచి భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ ఫోన్ నెంబర్ తీసుకుని, మాహీని సర్‌ప్రైజ్ చేశారట లతా మంగేష్కర్. 

411

2007 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని స్వయంగా ఫోన్ ద్వారా అభినందించిన లతా మంగేష్కర్, భారత జట్టు స్వదేశానికి చేరుకున్న తర్వాత విజయ యాత్రలో పాల్గొని వారిని సాదరంగా ఆహ్వానించింది కూడా...

511

2011 వన్డే వరల్డ్‌కప్‌లో పాకస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించాలని కోరుతూ ఆ రోజంతా ఉపవాసం ఉన్నారు లతా మంగేష్కర్...

611

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్‌కి వీడ్కోలు పలకబోతున్నాడని ప్రచారం జరిగింది. ఇది విని, లతా మంగేష్కర్ బాగా ఫీల్ అయ్యారు...

711

‘డియర్ ధోనీ జీ, నేను కొన్నాళ్లుగా నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్టుగా వార్తలు వింటున్నా. దయచేసి అలా ఆలోచించకు. ఈ దేశానికి నువ్వు కావాలి, నీ సేవలు కావాలి. క్రికెట్ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలు కూడా చేయకు...’ అంటూ ట్వీట్ చేశారు లతా మంగేష్కర్... 

811

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...

911

1983లో బీసీసీఐ, ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో న్యూఢిల్లీలోని నెహ్రా స్టేడియంలో ఓ సంగీత కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరించారు లతా మంగేష్కర్. 

1011

అలా వచ్చిన డబ్బులతో అప్పటి టీమిండియా మేనేజర్‌ మన్‌ సింగ్‌తో పాటు 14 మంది క్రికెటర్లకు రూ.21 లక్షలను అందించారు. 

1111

ఈ కారణంగానే పరిస్థితులు సద్ధుకున్న తర్వాత లతా మంగేష్కర్ కుటుంబానికి  ఇండియాలో జరిగే ప్రతీ క్రికెట్ మ్యాచ్‌కి ముందు రెండు టికెట్లను పంపుతూ వచ్చింది బీసీసీఐ. 

Read more Photos on
click me!

Recommended Stories