ధోనీని దాటేసిన విరాట్! కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ... సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ ఫీట్...

Published : Feb 06, 2022, 08:39 PM IST

సౌతాఫ్రికా టూర్‌లో వరుసగా ఐదు ఓటములు (రెండు టెస్టులు, మూడు వన్డేలు) తర్వాత ఎట్టకేలకు 2022లో తొలి విజయాన్ని రుచి చూసింది భారత జట్టు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

PREV
17
ధోనీని దాటేసిన విరాట్! కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ... సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ ఫీట్...

ఈ మ్యాచ్‌ ద్వారా పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నప్పటికీ, ఇప్పటికే రోహిత్ శర్మ 10 వన్డేల్లో తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు... 

27

కెప్టెన్‌గా 11 మ్యాచుల్లో రోహిత్ శర్మకు ఇది 9వ వన్డే విజయం... విరాట్ కోహ్లీ 11 మ్యాచుల్లో 8 విజయాలు అందుకుని రెండో స్థానంలో ఉంటే, రోహిత్ అతన్ని అధిగమించి టాప్‌లోకి దూసుకొచ్చాడు... వీరేంద్ర సెహ్వాగ్, అజేయ్ జడేజా ఏడేసి విజయాలు అందుకున్నారు...

37

క్రీజులోకి వస్తూనే వరుసగా రెండు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, స్వదేశంలో 5 వేల వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు... ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ...

47

సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 6979 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 5002 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఎమ్మెస్ ధోనీ 4351 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు...

57

అత్యంత వేగంగా స్వదేశంలో 5 వేల వన్డే పరుగులు అందుకున్న ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. విరాట్‌కి ఇది స్వదేశంలో 96వ వన్డే ఇన్నింగ్స్‌ కాగా, సచిన్ టెండూల్కర్ 121, జాక్వస్ కలీస్ 130, రికీ పాంటింగ్ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ పీట్ సాధించారు... 

67

భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించాడు రోహిత్ శర్మ.. వీరూ వన్డే ఓపెనర్‌గా 7240 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 7242 పరుగులతో సెహ్వాగ్‌ను అధిగమించాడు...

77

34 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించిన సూర్యకుమార్ యాదవ్, వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 30+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

Read more Photos on
click me!

Recommended Stories