Champions Trophy 2025 భార‌త్-న్యూజిలాండ్ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్

Published : Mar 08, 2025, 07:12 PM ISTUpdated : Mar 08, 2025, 07:18 PM IST

IND vs NZ:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఫైట్ కు ఇండియా vs న్యూజిలాండ్ సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ లో జ‌రిగే బిగ్ మ్యాచ్ కు ముందు భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది.   

PREV
14
 Champions Trophy 2025 భార‌త్-న్యూజిలాండ్ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్

Champions Trophy 2025 IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు ఇంకా కొన్ని గంటల స‌మ‌యం మాత్రమే మిగిలి ఉంది. కానీ దీనికి ముందే భార‌త జ‌ట్టుకు పెద్ద‌ ప్రమాదం పొంచివుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప‌లు మీడియా రిపోర్టుల ప్ర‌కారం భార‌త జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఫైన‌ల్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. అత‌నే విరాట్ కోహ్లీ.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ పోరుకు ముందు విరాట్ కోహ్లీ గాయ‌ప‌డ్డాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. భార‌త అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే మార్చి 9న జరిగే  భార‌త్-న్యూజిలాండ్ ఐసీసీ ట్రోఫీ టైటిల్ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11లో విరాట్ కోహ్లీ పేరు ఉంటుందా లేదా?

24
Image Credit: Getty Images

విరాట్ కోహ్లీ ఎలా గాయ‌ప‌డ్డారు? 

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 భార‌త్-ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఇరు జ‌ట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. రెండు టీమ్స్ మ్యాచ్ జ‌రిగే దుబాయ్ స్టేడియంలో గెలుపుకోసం ప్రాక్టీస్ చేస్తూ చెమ‌టోడుస్తున్నాయి. భార‌త జ‌ట్టు కూడా ఫైన‌ల్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ గాయ‌ప‌డ్డార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ వార్త‌లు భార‌త జ‌ట్టుతో పాటు క్రికెట్ ల‌వ‌ర్స్ ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప‌లు మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. కింగ్ కోహ్లీ ప్రాక్టీస్ సమయంలో అంటే బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డారు. దీని త‌ర్వాత కోహ్లీ చికిత్స కూడా తీసుకున్నారు. 

34
Image Credit: Getty Images

ఆందోళనలో క్రికెట్ లవర్స్ ! 

సంబంధిత మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో వేగంగా వేసిన బంతి విరాట్ కోహ్లీ మోకాలికి తగిలింది. దీంతో వెంట‌నే ప్రాక్టీస్ కూడా ఆపేశాడు. త‌ర్వాత అత‌నికి విశ్రాంతి ఇస్తూ చికిత్స అందించారు. ఐసీసీ క్రికెట్ అకాడమీలో కోహ్లీని భారత జట్టు ఫిజియోలు జాగ్రత్తగా చూసుకున్నారు. విరాట్ చాలా సేపు ప్రాక్టీస్‌కు తిరిగి రాలేదు. అయితే,  త‌ర్వాత భార‌త ఆట‌గాళ్ల ప్రాక్టీస్ ను చూస్తూ కోహ్లీ స‌మ‌యం గ‌డిపార‌ని సంబంధిత కథ‌నాలు పేర్కొన్నాయి. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మోకాలి నొప్పి కారణంగా కోహ్లీ జట్టును వీడాల్సి వచ్చింది. ఇప్పుడు కీల‌క‌మైన ఐసీసీ ట్రోఫీ ఫైన‌ల్ పోరుకు ముందు కోహ్లీ గాయం భార‌త జ‌ట్టులో ఆందోళ‌న‌ను మ‌రింత పెంచింది.

44
Image Credit: Getty Images

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 భార‌త్ vs న్యూజిలాండ్ ఫైన‌ల్ ఫైట్ లో కోహ్లీ ఆడ‌తాడా?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. టీమిండియా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు.  సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై భార‌త జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తూ 84 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ కు ముందు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. భార‌త జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో టాప్ స్కోరర్ల‌లో ఒక‌రిగా ఉన్నాడు.  

ఇప్పుడు కోహ్లీ గాయం భార‌త జ‌ట్టును ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మ‌రీ ముఖ్యంగా భార‌త క్రికెట్ అభిమానుల ఆందోళ‌న మ‌రింత‌ పెరిగింది. అయితే, విరాట్ కోహ్లీ గాయం అంత తీవ్రమైనది కాద‌ని కూడా ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, విరాట్ కోహ్లీ ఫైనల్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడనీ, మ్యాచ్ ను త‌ప్ప‌కుండా ఆడ‌తాడ‌ని కూడా పేర్కొంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ బీసీసీఐ గానీ, భార‌త జ‌ట్టు గానీ కోహ్లీ గాయంపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories