అక్టోబర్ 31న అన్ని జట్లు తమ తమ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరు లేకుండానే ఐదుగురు ఆటగాళ్లను లక్నో జట్టు అట్టిపెట్టుకుంది. ఈ జాబితాలో నికోలస్ పురాన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీలు ఉన్నారు.
దీంతో కేఎల్ రాహుల్ వేలంలోకి వచ్చాడు. అతని పై ఏ జట్టు పందెం నెగ్గుతుందనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అటువంటి పరిస్థితిలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌ను దక్కించుకోవడానికి 3 జట్లు ముందుంటాయని చెప్పారు. వాటిలో ఆర్సీబీ, సీఎస్కే, ఎస్ఆర్హెచ్ ల గురించి ప్రస్తావించారు.