సఫారీలకు భారీ షాక్.. అదే జరిగితే వన్డే ప్రపంచకప్ రేస్ నుంచి తప్పుకున్నట్టే..?

Published : Jul 13, 2022, 02:47 PM IST

Big blow for South Africa: ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న పెద్ద దేశాలలో  ప్రపంచకప్ నెగ్గని జట్టుగా ఉన్న  సౌతాఫ్రికాకు వచ్చే ఏడాది జరుగబోయే వన్డే వరల్డ్ కప్ నకు ముందే భారీ షాక్ తగిలింది. 

PREV
18
సఫారీలకు భారీ షాక్.. అదే జరిగితే వన్డే ప్రపంచకప్ రేస్ నుంచి తప్పుకున్నట్టే..?
Image credit: PTI

ఐసీసీ సభ్యత్వం ఉండి క్రికెట్ ఆడుతున్న  దేశాలలో వన్డే ప్రపంచకప్ నెగ్గని జట్లలో  ముఖ్యంగా చెప్పుకునేవి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్. గత వన్డే ప్రపంచకప్ వరకు ఇంగ్లాండ్ ఈ  జాబితాలో ఉండేది. కానీ  2019 లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టుకు ఆ బాధ తీరిపోయింది.  

28

కానీ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మాత్రం ఇంకా తమ ప్రపంచకప్ లక్ష్యాలను చేరుకోలేదు.  కివీస్ సంగతి కాసేపు పక్కనబెడితే దక్షిణాఫ్రికా  ప్రపంచకప్ నెగ్గడానికి అన్ని అర్హతలు ఉన్నా దానికి అదృష్టం లేదు.  పలుమార్లు ప్రపంచకప్ లో సెమీస్ వరకు వచ్చి.. కీలక పోరుల్లో ఓడింది ఆ జట్టు. 

38
Image credit: PTI

వచ్చే  ఏడాది భారత్ లో జరగాల్సి ఉన్న వన్డే ప్రపంచకప్ లో అయినా ఈ ముచ్చట తీర్చుకోవాలని సఫారీలు భావించారు. కానీ  తాజాగా సఫారీ క్రికెట్ బోర్డు నిర్ణయంతో  దక్షిణాఫ్రికాకు ఈసారి కూడా ప్రపంచకప్ కలగానే మిగిలిపోనుంది. 

48

ఏం జరిగిందంటే.. ఈ ఏడాది డిసెంబర్ లో  సఫారీలు  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. మూడు టెస్టుల తర్వాత దక్షిణాఫ్రికా  జట్టు.. ఆసీస్ తో పరిమిత ఓవర్ల సిరీస్ లు కూడా ఆడాల్సి ఉంది.  అయితే టెస్టులు ఆడటానికి అంగీకారం తెలిపిన  సఫారీలు.. తాము వన్డేలు మాత్రం ఆడలేమని తెగేసి చెప్పారు. ఇప్పుడు ఇదే ముప్పునకు వచ్చింది. 
 

58

జనవరిలో  దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు   దేశవాళీలో టీ20 లీగ్ నిర్వహిస్తున్నది. ఈ లీగ్ నేపథ్యంలో  ఆసీస్ తో వన్డే సిరీస్ ను  రద్దు చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ను కోరింది. అయితే సీఏ దీనికి అంగీకరించలేదు. దీంతో దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్ లో నేరుగా అడుగుపెట్టే అవకాశాలు సంక్లిష్టంగా  మారనున్నాయి. 
 

68

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌లీగ్‌ లో భాగంగా.. జనవరి 12 నుంచి 17 వరకు ఆసీస్-ప్రొటీస్ మధ్య మూడువన్డేలు జరగాల్సి ఉంది. కానీ తమకు దేశవాళీ క్రికెట్  టీ20 లీగ్ ఉన్నందువల్ల ఆ సిరీస్ ను  పోస్ట్  పోన్ చేయాలని  సఫారీ క్రికెట్ బోర్డు  కోరినా దానికి ఆసీస్ అంగీకరించలేదు. తాము ఇదివరకే  తీరికలేని క్రికెట్ షెడ్యూల్ తో  బిజీగా ఉన్నామని.. ముందుగా ప్రకటించే షెడ్యూల్ ను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

78

దీంతో సఫారీలకు  ప్రపంచకప్ అర్హత సంక్లిష్టం కానుంది. ప్రస్తుతం ఆ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌లీగ్‌ లో పాయింట్ల పట్టికలో  సఫారీలు 11వ స్థానంలో ఉన్నారు. ఈ సిరీస్ ను రద్దు చేసుకుంటే ఆ జట్టు ప్రపంచకప్ లో పాల్గొనడానికి అర్హత మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. 

88

13 దేశాలు పాల్గొనే ఈ సూపర్‌ లీగ్‌లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన దేశాలతో పాటు నెదర్లాండ్స్‌ పోటీ పడనుంది. ఈ అర్హత రౌండ్ కు నెదర్లాండ్స్  ఇప్పటికే   క్వాలిఫై అయింది. ఈ టోర్నీలో టాప్-8 లో ఉన్న జట్లు నేరుగా  క్వాలిఫై అవుతాయి. దక్షిణాఫ్రికా గనక టాప్-8 లో చోటు దక్కించుకోకుంటే క్వాలిఫై రౌండ్  ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్ లో  గెలిచిన రెండు జట్లు  ప్రపంచకప్ కు అర్హత సాధిస్తాయి. మరి దక్షిణాఫ్రికా  నేరుగా అర్హత సాధిస్తుందా..? లేక క్వాలిఫై రౌండ్ ఆడి  బరిలోకి వస్తుందా..? అనేది తేలాల్సి ఉంది. 

click me!

Recommended Stories