భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ రికార్డులు:
భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు (ఏప్రిల్ 8, 2025) మొత్తం 179 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 184 వికెట్లు తీసుకున్నాడు. 27.28 బౌలింగ్ సగటుతో ఎకానమీ రేటు 7.58 గా ఉండటం విశేషం. ఐపీఎల్ లో భేవనేశ్వర్ కుమార్ బెస్ట్ బౌలింగ్ 5/19 వికెట్లు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్, మొత్తంగా అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో బౌలర్. మొదటి రెండు స్థానాల్లో యుజ్వేంద్ర చాహల్ 206 వికెట్లు, పియూష్ చావ్లా 192 వికెట్లతో ఉన్నాడు. భూవీ తన ఐపీఎల్ కెరీర్‌లో 2 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు సాధించాడు.
భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 11 సంవత్సరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రధాన బౌలర్‌గా మారాడు. ఎస్ఆర్హెచ్ వదులుకోవడంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని ఆర్‌సీబీ 10.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2016, 2017 ఎడిషన్లలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.