ఏ దేశంతో ఆడుతున్నది కూడా తెలియకపోతే ఎలా బాబర్... నెదర్లాండ్స్‌తో మ్యాచ్ తర్వాత...

First Published Aug 22, 2022, 3:50 PM IST

ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్ బాబర్ ఆజమ్. ఈ పాకిస్తాన్ కెప్టెన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. పసికూన నెదర్లాండ్స్‌ని మూడు వన్డేల్లో ఓడించి సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది పాకిస్తాన్ జట్టు...

Image credit: PTI

నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లో 3 మ్యాచుల్లో 74 సగటుతో 222 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తొలి వన్డేలో 85 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన బాబర్ జాజమ్, రెండో వన్డేలో 65 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. 

Babar Azam

మూడో వన్డేలో 125 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసిన బాబర్... సెంచరీకి చేరువలో బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 206 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

Image Credit: Getty Images

అయితే పాక్ బౌలర్ నసీం షా ఐదు వికెట్లు తీయడంతో 207 లక్ష్యఛేదనలో 197 పరుగులకి పరిమితమైన నెదర్లాండ్స్... 9 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. ఈ విజయం తర్వాత బాబర్ ఆజమ్ మాట్లాడుతూ... తమను ఆలౌట్ చేసిన ప్రత్యర్థి బౌలర్లను అభినందించాల్సిందేనని అన్నాడు...

అయితే ఆడుతున్నది నెదర్లాండ్స్‌‌తో అనే విషయం కూడా మరిచిపోయిన బాబర్, ‘స్కాట్లాండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలంటూ’ కామెంట్ చేశాడు. దీంతో ఆడుతున్నది ఏ దేశంపైన అనే విషయం కూడా తెలియకుండా ఎంత మత్తులో ఉన్నాడో పాపం... అంటూ బాబర్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఓమన్, యూఏఈ, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాలపై క్రికెట్ ఆడుతూ రికార్డులు క్రియేట్ చేసే బాబర్ ఆజమ్... నెదర్లాండ్స్‌కి బదులుగా స్కాట్లాండ్‌ అనడంలో తప్పు లేదని... ఏ ఆస్ట్రేలియాతో ఆడుతూనో, ఇంగ్లాండ్ బౌలర్లనో అని ఉంటే ఎక్కువ ఆశ్చర్యపోవాల్సి వచ్చేదని అంటున్నారు మరికొందరు నెటిజన్లు...

click me!