ఇది ఛీటింగ్ చేసి గెలవడం లాంటిదే! మేమైతే ఇలా గెలవాలని అనుకోం! ... జానీ బెయిర్‌స్టో రనౌట్‌పై బెన్ స్టోక్స్..

Published : Jul 03, 2023, 11:02 AM IST

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ 43 పరుగుల తేడాతో ఓడింది. బెన్ స్టోక్స్ మరో 20 నిమిషాలు క్రీజులో ఉన్నా, లేదా జానీ బెయిర్‌స్టో నాటౌట్‌గా తేలి ఉన్నా ఫలితం వేరేగా ఉండేది. 10 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, నిర్లక్ష్యంగా క్రీజు దాటి అవుట్ అయ్యాడు..

PREV
16
ఇది ఛీటింగ్ చేసి గెలవడం లాంటిదే! మేమైతే ఇలా గెలవాలని అనుకోం! ... జానీ బెయిర్‌స్టో రనౌట్‌పై బెన్ స్టోక్స్..
Jonny Bairstow

ఓవర్ అయిపోయిందని జానీ బెయిర్‌స్టో, అంపైర్ వైపు చూడకుండా ముందుకు నడిచాడు. దీన్ని గమనించిన అలెక్స్ క్యారీ, వికెట్లను గిరాటేశాడు. వెంటనే ఆస్ట్రేలియా ఫీల్డర్లు అప్పీలు చేయడం, థర్డ్ అంపైర్ స్టంపౌట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి..

26
Jonny Bairstow

జానీ బెయిర్‌స్టో సింగిల్ తీయాలనే ఉద్దేశంతో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో నాన్‌ స్ట్రైయికర్ బెన్ స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయం ఆస్ట్రేలియాకి కూడా తెలుసు. అయినా వికెట్ కోసం అప్పీలు చేయడాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు..
 

36

ఈ విషయంపై ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా తీవ్రంగా స్పందించాడు. ‘బెయిర్ స్టో వికెట్ విషయంలో అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూశాను. మేం ఆ పొజిషన్‌లో ఉంటే కచ్ఛితంగా అప్పీల్ వెనక్కి తీసుకునేవాళ్లం. ఇలా గెలవాలని మాత్రం అనుకోం...
 

46

టాస్ గెలిచిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో వాళ్లను 300 పరుగుల లోపు నియంత్రించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. 2-0 తేడాతో వెనకబడి ఉన్నా 2-3 తేడాతో సిరీస్ గెలిచేందుకు మాకు ఇంకా అవకాశం ఉంది.. ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్..

56
Ashes 2023

బెన్ స్టోక్స్ కామెంట్లపై ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమ్మిన్స్ భిన్నంగా స్పందించాడు. ‘వాళ్లు ఇదే పొజిషన్‌లో ఉండి ఉంటే, అప్పీలు వెనక్కి తీసుకునేవాళ్లం అన్నారు...’ అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ‘ఒకే’ అంటూ సమాధానం ఇచ్చాడు ప్యాట్ కమ్మిన్స్...
 

66
Ashes

‘అలెక్స్ క్యారీ, అంతకుముందు బాల్స్ నుంచే జానీ బెయిర్‌స్టోని గమనిస్తూ ఉన్నాడు. అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. క్యాచ్ అందుకోగానే త్రో వేశాడు. ఇందులో ఛీటింగ్ ఏమీ లేదు. రూల్ ప్రకారమే వికెట్ తీశాం.. నిన్న క్యాచ్ లాగే దీన్ని చాలామంది ఒప్పుకోరు.. అన్నీ రూల్స్ అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు ప్యాట్ కమ్మిన్స్.. 

click me!

Recommended Stories