జోస్ బట్లర్‌కి రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చిన ఐపీఎల్ టీమ్... అంతర్జాతీయ క్రికెట్ మానేసి, ఫ్రాంఛైజీ లీగ్‌లకే...

Published : Jul 02, 2023, 04:44 PM IST

టూ టైం వరల్డ్ కప్ ఛాంపియన్‌ వెస్టిండీస్, 2023 వన్డే వరల్డ్ కప్‌కి అర్హత కూడా సాధించలేకపోయింది. ఫ్రాంఛైజీ క్రికెట్ మోజులో అంతర్జాతీయ క్రికెట్‌ని పట్టించుకోకుండా పక్కనబెట్టేసిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, దానికి భారీ మూల్యమే చెల్లించుకుంది..

PREV
16
జోస్ బట్లర్‌కి రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చిన ఐపీఎల్ టీమ్... అంతర్జాతీయ క్రికెట్ మానేసి, ఫ్రాంఛైజీ లీగ్‌లకే...

2017 ఛాంపియన్స్ లీగ్‌కి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫైయర్స్ స్టేజీలోనే చిత్తుగా ఓడి, గ్రూప్ స్టేజీకి కూడా రాలేకపోయింది విండీస్. వెస్టిండీస్ క్రికెట్ పతనానికి కారణమైన ఫ్రాంఛైజీ క్రికెట్, ఇప్పుడు ఇంగ్లాండ్‌వైపు చూస్తోంది..
 

26
boult buttler

ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీశమ్, మార్టిన్ గుప్తిల్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్ వంటి ప్లేయర్లు, ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకున్నారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్లను ఫ్రాంఛైజీ క్రికెట్‌కి అంకితం చేసేందుకు కోట్ల రూపాయలు ఆశచూపిస్తున్నాయి ఫ్రాంఛైజీలు..

36

ఇప్పటికే జోఫ్రా ఆర్చర్‌తో పాటు జాసన్ రాయ్‌కి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ ఆశచూపించిన ఫ్రాంఛైజీలు, తాజాగా ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌కి రూ.40 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.. 

46


ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడుతున్న జోస్ బట్లర్, సౌతాఫ్రికా20 లీగ్‌లో అదే ఫ్రాంఛైజీకి చెందిన పర్ల్ రాయల్స్ టీమ్‌కి ఆడుతున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి బర్బోడాస్ రాయల్స్ పేరుతో టీమ్‌ ఉంది. 
 

56
Image credit: PTI

అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పి ఈ టీమ్స్‌కి ఆడేందుకు జోస్ బట్లర్‌కి నాలుగేళ్లకు రూ.40 కోట్లు ఇచ్చేందుకు... అంటే ఏడాదికి రూ.10 కోట్లు చెల్లించేందుకు రాజస్థాన్ రాయల్స్ ఆశచూపినట్టు సమాచారం... అయితే దీనిపై జోస్ బట్లర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
 

66

జోస్ బట్లర్ కెప్టెన్సీలో 2022 టీ20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా బరిలో దిగుతోంది. జోస్ బట్లర్, ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కి ఊహించని షాక్ తగులుతుంది.. 

click me!

Recommended Stories