టెస్టుల్లో ఒకే కానీ... బాబర్ ఆజమ్‌, టీ20లకు పనికి రాడు! షోయబ్ అక్తర్‌తో హర్భజన్ సింగ్ కామెంట్...

Published : Jul 02, 2023, 05:24 PM ISTUpdated : Jul 02, 2023, 05:29 PM IST

ప్రస్తుత తరంలో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరు? ఈ ప్రశ్నకు ఒకరు విరాట్ కోహ్లీ అంటే మరొకరు స్టీవ్ స్మిత్ అని సమాధానం ఇస్తారు. ఇంకొందరు జో రూట్ గ్రేట్ బ్యాటర్ అంటే, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం బాబర్ ఆజమ్‌ ముందు వీళ్లంతా దేనికి పనికి రారని అంటారు...

PREV
17
టెస్టుల్లో ఒకే కానీ... బాబర్ ఆజమ్‌, టీ20లకు పనికి రాడు! షోయబ్ అక్తర్‌తో హర్భజన్ సింగ్ కామెంట్...

విరాట్ కోహ్లీ కొట్టే స్ట్రైయిట్ డ్రైవ్‌‌ కంటే, బాబర్ ఆజమ్ స్ట్రైయిట్ డ్రైవ్ చూడచక్కగా ఉంటుందని అంటారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న బాబర్ ఆజమ్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన హవా చూపిస్తున్నాడు...

27

తాజాగా హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో షోయబ్ అక్తర్‌‌ని ఈ ప్రశ్నే అడిగాడు. ‘విరాట్ కోహ్లీ లేదా బాబర్ ఆజమ్ ఈ ఇద్దరిలో గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరు? ప్రస్తుత తరంలో అసలైన కింగ్ ఎవరు?’ అంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌ని ప్రశ్నించాడు హర్భజన్ సింగ్..
 

37

దీనికి ఏ మాత్రం ఆలోచించకుండా.. ‘విరాట్ కోహ్లీ ప్రస్తుత తరంలో గ్రేటెస్ట్ బ్యాటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. బాబర్ ఆజమ్ ఆల్‌టైం గ్రేటెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాడు...

47
Babar Azam

టీ20ల్లో తనని తాను మరింత మెరుగుపర్చుకునేందుకు బాబర్ ఆజమ్ ప్రయత్నిస్తున్నాడు. అయితే అతనిపై ఏ కారణం లేకుండా తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది... ’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్..

57

‘విరాట్ కోహ్లీ ఇప్పటికే గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. ఆ స్థాయిని అందుకోవాలంటే బాబర్ ఆజమ్ ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. అతను అద్భుతమైన ప్లేయర్, ఏదో ఒకరోజు విరాట్ స్థాయిని అందుకుంటాడనే నమ్మకం ఉంది. 
 

67

టెస్టుల్లో బాబర్ ఆజమ్ చాలా మంచి ప్లేయర్, అయితే టీ20లకు అతను పెద్దగా పనికి రాడు... అతను సుదీర్ఘ ఫార్మాట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడితే బాగా సక్సెస్ అవుతాడని నా అభిప్రాయం’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...

77
Image Credit: Getty Images

విరాట్ కోహ్లీ రికార్డులను అందుకోవాలంటే బాబర్ ఆజమ్ మరో 13 వేల పరుగులు చేయాల్సి ఉంటుంది. 2010-20 దశకంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories