Virat Kohli vs BCCI: తొమ్మిదినెలల క్రితం భారత క్రికెట్ లో జోరుగా చర్చ జరిగిన ఓ అంశంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యం నుంచి తప్పుకోవడం పూర్తిగా కోహ్లీకి సంబంధించిన విషయమని..
గతేడాది నవంబర్ లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో బీసీసీఐ వాటిని రోహిత్ శర్మకు అప్పజెప్పింది. కొద్దిరోజుల తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథ్య బాధ్యతలను కోహ్లీ నుంచి తీసుకుని వాటిని కూడా రోహిత్ కే అందజేసింది.
27
ఆ సమయంలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని, బీసీసీఐ ఈ విషయంలో అతడికి అన్యాయం చేసిందని చర్చ జరిగింది. ఇదిలాఉంటే జనవరిలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
37
Image credit: Getty
అక్కడ టెస్టు సిరీస్ ముగిశాక కోహ్లీ.. టెస్టు సారథ్య బాధ్యతలను కూడా వదిలేశాడు. ఆ సమయంలో కూడా అందరి వేళ్లు బీసీసీఐ మీదకే మళ్లాయి. బీసీసీఐ ఒత్తిడి చేయడం వల్లే కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నాడని వాదనలు వినిపించాయి. అయితే దీనిపై బీసీసీఐ ఇన్నాళ్లు నోరు మెదపలేదు.
47
Arun Dhumal
తాజాగా ఇదే విషయమై బీసీసీఐ ట్రెజరర్ (కోశాధికారి) అరుణ్ ధుమాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. టెస్టుల నుంచి తప్పుకోవడమనేది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశాడు. కోహ్లీ ఏం సాధారణ ఆటగాడు కాదని.. టీమిండియాకు అతడు చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడాడు.
57
ధుమాల్ మాట్లాడుతూ.. ‘అది (టెస్టులలో కెప్టెన్సీ వదులుకోవడం) పూర్తిగా కోహ్లీ స్వంత నిర్ణయం. అతడేం సాధారణ ఆటగాడు కాదు. టీమిండియాకు అతడు చేసిన సేవలు కొలవలేనివి. కోహ్లీ అద్భుత ఆటగాడు. బోర్డు ఒత్తిడి వల్లే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడనేది కరెక్ట్ కాదు. కోహ్లీ నిర్ణయాన్ని మేం గౌరవించాం.
67
మీడియాలో ఈ వార్తలు వచ్చినప్పుడు మేమూ చూశాం. కానీ వాటిని మేం పట్టించుకోలేదు. ఇక కోహ్లీ త్వరలోనే ఫామ్ లోకి వస్తాడు. అయితే ఫామ్ లేమి కారణంగా కోహ్లీని జట్టులో ఉంచుతారా..? రెస్ట్ ఇస్తారా..? అనేది నా చేతుల్లో లేదు. అది సెలక్షన్ కమిటీ చూసుకుంటుంది..’ అని తెలిపాడు.
77
కోహ్లీ సారథిగా తప్పుకున్నాక ఒత్తిడిలేకుండా స్వేచ్ఛగా ఆడతాడని అతడి అభిమానులు భావించినా అతడు మాత్రం అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాఫ్ అయిన కోహ్లీ.. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా దానినే కొనసాగించి విమర్శలపాలయ్యాడు.