పృథ్వీ షా త్రిబుల్ సెంచరీపై జై షా ట్వీట్... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చోటు దక్కినట్టేనా...

First Published Jan 12, 2023, 10:56 AM IST

టీమిండియాలోకి సంచలనంలా దూసుకొచ్చి, అంతే వేగంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు పృథ్వీ షా. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్‌ బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతూ సచిన్ టెండూల్కర్ హైట్‌తో, బ్రియాన్ లారా టెక్నిక్‌తో అదరగొడతాడని ప్రశంసలు దక్కించుకున్న పృథ్వీ షా, రెండేళ్లుగా టెస్టు టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు...

Prithvi Shaw

ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత పృథ్వీ షాని పూర్తిగా పక్కనబెట్టేసింది టీమిండియా. ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులే చేసిన పృథ్వీ షా... తొలి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు...


రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, హనుమ విహారి, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కెఎల్ రాహుల్... ఇలా అరడజను మంది ప్లేయర్లు గాయాలతో జట్టుకి దూరమైన తర్వాత కూడా బ్రిస్బేన్ టెస్టులో పృథ్వీ షాకి చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత ఐపీఎల్ 2021, 2022 సీజన్లలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించిన పృథ్వీ షా... దేశవాళీ టోర్నీలు సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో రికార్డులు తిరగరాశాడు...

prithvi shaw

తాజాగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 379 పరుగులు చేసిన పృథ్వీ షా.. రంజీ ట్రోఫీలో అత్యధిక రెండో వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు... సంజయ్ మంజ్రేకర్ చేసిన 377 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు పృథ్వీ షా...

prithvi shaw

‘రికార్డుల పుస్తకంలో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావ్ పృథ్వీ షా... రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసినందుకు నీకు కంగ్రాట్స్. గర్వంగా ఉంది. నీలో టన్నుల్లో టాలెంట్ ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

జై షా ట్వీట్‌తో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసే జట్టులో పృథ్వీ షా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఆస్ట్రేలియా టూర్‌లో టీమ్‌లో చోటు కోల్పోయిన పృథ్వీ షా, మళ్లీ ఆస్ట్రేలియాపైనే రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నారు...
 

‘ఈ సీజన్‌లో నా బ్యాటింగ్‌తో సంతృప్తిగా ఉన్నా, అయితే భారీ స్కోరు చేయలేకపోయా. ఈ ఇన్నింగ్స్‌తో ఆ కోరిక తీరిపోయింది. నా హార్డ్‌వర్క్‌కి  దక్కిన ఫలితం ఇది. నేను ఎక్కువ మందితో మాట్లాడను..

Prithvi Shaw

నా బ్యాటింగ్ పాత ఫుటేజీలను చూసుకుంటూ లోపాలను సరిచేసుకుంటున్నా. నా తప్పేంటో నేను తెలుసుకోవాలి. ఇప్పటికైతే అంతా బాగానే జరుగుతుంది. పరుగులు చేయలేనప్పుడు అందరూ విమర్శిస్తారు...

ఆ విమర్శలను నేను పట్టించుకోను. కష్టకాలంలో నాకు తోడుగా లేని వాళ్ల మాటలకు నేను ప్రాధాన్యం ఇవ్వను. నేను ఏం తప్పు చేస్తున్నానో, ఏది కరెక్టుగా చేస్తున్నానో నాకు బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు పృథ్వీ షా.. 

click me!