అసలు వయసు ఎంతున్నా, తక్కువ వయసు చూపించి టీమ్‌లోకి వచ్చేవాళ్లు ఎందరో... భారత జట్టులో ఇలాంటి మోసాలు తక్కువే కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో చాలా ఫేమస్. ఆ దేశ క్రికెటర్లు కూడా ఈ విషయం గురించి చాలా సార్లు మాట్లాడారు... ఇప్పటికీ పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ వయసుపై క్లారిటీ లేదు..
అండర్ 19 వరల్డ్ కప్ 2022 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగర్కేకర్ వయసు గురించి చాలా పెద్ద రచ్చే జరిగింది. రాజవర్థన్ తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి, వయసు తక్కువగా చూపించి తమను మోసం చేశాడంటూ మహారాష్ట్ర క్రీడా శాఖ, బీసీసీఐకి లేఖ రాసింది...
25
21 ఏళ్ల రాజవర్థన్, అండర్19లో పాల్గొనడం కోసం 18 ఏళ్లు ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించినట్టు బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పెద్దగా సీరియస్‌గా తీసుకోని బీసీసీఐ, రాజవర్థన్ హంగర్కేకర్‌ను ఐపీఎల్ ఆడనిచ్చింది...
35
అయితే ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు. ప్రస్తుతం ఆటగాళ్ల వయసును గుర్తించేందుకు టీడబ్ల్యూ3 పద్ధతిని వాడుతోంది బీసీసీఐ...
45
Image credit: Getty
ఎముక మజ్జను పరీక్షించి, ఆటగాడి వయసు ధృవీకరించేందుకు దాదాపు రూ.2400 వరకూ ఖర్చు అవుతోంది. అయితే ఈ పరీక్ష రిజల్ట్ వచ్చేందుకు మూడు - నాలుగు రోజులు పడుతుంది. ఈ ఖర్చును, సమయాన్ని తగ్గించేందుకు సులభమైన బోన్‌ఎక్స్‌పర్ట్ సాఫ్ట్‌వేర్‌ను వాడాలని ఆలోచన చేస్తోందట బీసీసీఐ...
55
కేవలం రూ.288కే ఆటగాడి వయసును తేల్చే ఈ సాఫ్ట్‌వేర్, నిమిషాల్లోనే రిజల్ట్ ఇస్తుంది. అండర్ 13, అండర్ 16, అండర్ 19 కేటగిరీల్లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తోంది బీసీసీఐ...