ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిజీ షెడ్యూల్ కారణంగా వన్డే ఫార్మాట్‌కి పూర్తి న్యాయం చేయలేకపోతున్నానంటూ బెన్ స్టోక్స్ తప్పుకోవడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసింది. అయితే చాలామంది క్రికెటర్లు, ఈ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌ని ఫాలో అవుతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
‘50 ఓవర్ల క్రికెట్‌కి కాలం చెల్లింది. కేవలం వరల్డ్ కప్ మీద ఆధారపడి వన్డేలను కాపాడాలంటే కష్టమే. ఐసీసీ దృష్టిలో చూస్తే వరల్డ్ కప్స్ చాలా కీలకం. అది టీ20 వరల్డ్ కప్ కావచ్చ, వన్డే వరల్డ్ కప్ కావచ్చు...
27
Image credit: Getty
టెస్టు క్రికెట్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ సంప్రదాయ సుదీర్ఘ ఫార్మాట్‌ని ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు... అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లపై భారం పడుతోంది...
37
Ravi Shastri with Hardik Pandya
ఏ ఫార్మాట్ ఏ ప్లేయర్లు ఆడాలో ఎంచుకునే స్వేచ్ఛ కల్పించారు. హార్ధిక్ పాండ్యా విషయానికి వస్తే అతను టీ20 క్రికెట్ ఆడేందుకే ఎక్కువ ఇష్టపడతాడు. అతను టీ20లు తప్ప మిగిలిన ఫార్మాట్ ఆడకూడదనే ఆలోచనతో ఉన్నాడు...
47
అతను ఇప్పుడు వన్డేలు ఆడుతున్నది కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండడం వల్లనే. ఆ తర్వాత హార్ధిక్ పాండ్యాని వన్డేల్లో చూడడం కష్టమే. హార్ధిక్ పాండ్యా మాత్రమే కాదు, చాలామంది ప్లేయర్లు, ఏ ఫార్మాట్ ఆడాలో నిర్ణయించుకోబోతున్నారు...
57
Image credit: Getty
వాళ్లకు ఆ హక్కు కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం బిజీ షెడ్యూల్. ఇప్పుడే కాదు గత 5, 10 ఏళ్ల నుంచే ఇది జరుగుతోంది. క్రికెట్‌కి మార్కెట్ పెరిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బోర్డులను నడిపించే మేనేజ్‌మెంట్ మొత్తం ఈ క్రేజ్‌ని ఎలా క్యాష్ చేసుకోవాలా? అనే ఆలోచిస్తోంది...
67
ఫ్రాంఛైజీ క్రికెట్ ఇప్పుడు ప్రధాన ఇంధన వనరుగా మారిపోయింది. కాబట్టి దాని తర్వాతే మిగిలినవాటిపై ఫోకస్ పెడుతున్నారు.
77
Image credit: PTI
అంతర్జాతీయ క్రికెట్ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్‌లే ప్రధానంగా మారిపోయే రోజులు కూడా త్వరలోనే రాబోతున్నాయి...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...