రెండు వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన శ్రీలంక, ఇప్పుడు సరైన విజయాలు అందుకోవడానికే అష్టకష్టాలు పడుతోంది. కుమార సంగర్కర, మహేళ జయవర్థనే, లసిత్ మలింగ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్ అయిన తర్వాత లంక జట్టు బలహీనంగా మారిపోయింది. ఇప్పుడు లంక జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్...
ఆల్‌రౌండర్‌గా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఏంజెలో మాథ్యూస్, కెరీర్ ఆరంభంలో భారీ హిట్టర్‌గా అదరగొట్టాడు. అయితే గాయాలు అతని కెరీర్‌ని అతలాకుతలం చేశాయి... గాయాల కారణంగా బౌలింగ్‌కి స్వస్తి చెప్పిన మాథ్యూస్, పాకిస్తాన్‌తో జరిగే రెండో టెస్టుతో వంద టెస్టులు పూర్తి చేసుకున్నాడు...
210
Angelo Mathews
ప్రస్తుత క్రికెట్‌లో 100కు పైగా టెస్టులు ఆడిన ఏడో ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 172 టెస్టులు ఆడగా అతని సహచర బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 156 టెస్టులు ఆడాడు. ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్ 121 టెస్టులతో మూడో స్థానంలో ఉన్నాడు...
310
Angelo Mathews
ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ 110 టెస్టులు ఆడగా భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ 105, విరాట్ కోహ్లీ 102 టెస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
410
angelo mathews
2009లో గాలేలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టెస్టు ఆరంగ్రేటం చేసిన ఏంజెలో మాథ్యూస్, తన 25వ, 49వ, 50వ, 99వ టెస్టు మ్యాచులను పాకిస్తాన్‌పైనే ఆడాడు. తన వందో టెస్టు కూడా పాక్‌పైనే ఆడుతున్నాడు మాథ్యూస్...
510
అత్యధికంగా ఇంగ్లాండ్ నుంచి 15 మంది ప్లేయర్లు 100కి పైగా టెస్టులు ఆడగా ఆస్ట్రేలియా నుంచి 13, టీమిండియా నుంచి 12 మంది, వెస్టిండీస్ నుంచి 9 మంది, సౌతాఫ్రికా నుంచి 8 మంది ప్లేయర్లు 100కి పైగా టెస్టులు ఆడారు. శ్రీలంక నుంచి 100వ టెస్టు ఆడుతున్న ఆరో ప్లేయర్‌గా నిలిచాడు ఏంజెలో మాథ్యూస్...
610
‘నాకు జేమ్స్ అండర్సనే ఆదర్శం. 40 ఏళ్లు వచ్చినా ఫాస్ట్ బౌలర్ ఇంకా కొన్నేళ్లు ఆడాలని ఆరాటపడుతున్నాడు. అతని పట్టుదల నుంచి ఎంతో నేర్చుకున్నా..
710
నేను ఇక్కడే ఆగాలని అనుకోవడం లేదు. ఇంకొన్నేళ్లు ఆడాలని అనుకుంటున్నా. నా వరకూ వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. నేను ఇప్పటికీ మూడు ఫార్మాట్లలో రాణించగలనన్న నమ్మకం ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు 35 ఏళ్ల ఏంజెలో మాథ్యూస్...
810
99 టెస్టుల్లో 45.24 సగటుతో 6876 పరుగులు చేశాడు ఏంజెలో మాథ్యూస్. ఇందులో 13 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 33 వికెట్లు తీసిన మాథ్యూస్, గాయం కారణంగా బౌలింగ్ చేయడం మానేశాడు..
910
Angelo Mathews
‘వన్డేల్లో, టీ20ల్లో బౌలింగ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే టెస్టుల్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే ఫిట్‌గా ఉండాలి. అయినా ఇక్కడి పిచ్‌లపై నా బౌలింగ్ అవసరం టీమ్‌కి ఎక్కువగా రాదు...
1010
మిగిలిన ఫార్మాట్లతో పోలిస్తే టెస్టు క్రికెట్ ఆడడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే చాలామంది స్టార్ ప్లేయర్లు ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనే కొనసాగుతున్నారు..’ అంటూ కామెంట్ చేశాడు ఏంజెలో మాథ్యూస్...