రోహిత్ శర్మ చాలా మెచ్యూర్డ్ కెప్టెన్... సౌరవ్ గంగూలీ కామెంట్! కోహ్లీని ట్రోల్ చేస్తున్నాడంటూ...

First Published Aug 18, 2022, 5:04 PM IST

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ నెగ్గిన రోహిత్ శర్మ, వెస్టిండీస్‌ టూర్‌లో టీ20 సిరీస్‌ని 4-1 తేడాతో దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టైటిల్ ఫెవరెట్స్‌గా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో బరిలో దిగుతోంది...

Image credit: Getty

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నయా సారథి రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘రోహిత్ శర్మ కాస్త నెమ్మదస్తుడు... అతను ప్రతీ విషయాన్ని చాలా కూల్‌గా, కామ్‌గా తీసుకుంటాడు...

రోహిత్ శర్మ మిగిలిన వాళ్లల్లా ముఖం మీద కోపాన్ని చూపించే రకం కాదు. చాలా మెచ్యూర్డ్ కెప్టెన్... గత కొన్నేళ్లల్లో టీమిండియా గొప్ప గొప్ప కెప్టెన్లను చూసింది. ఎమ్మెస్ ధోనీ ప్రతీ దాన్ని చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తాడు. అందుకే అతను టీమిండియాకే కాకుండా సీఎస్‌కే ఫ్రాంఛైజీకి కూడా విజయాలు అందించాడు...

విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. అతను ఈ ఇద్దరితో పోలిస్తే భిన్నమైన కెప్టెన్. విరాట్ విషయాలను చూసే విధానం కూడా వేరేగా ఉంటుంది.. ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది... ఆఖరికి కావాల్సింది రిజల్ట్ మాత్రమే...

rohit sharma

ఎన్ని విజయాలు అందుకున్నారు, ఎన్ని మ్యాచులు ఓడిపోయారు అని.. నేనెప్పుడూ కెప్టెన్లను పోల్చి చూడను. ఎందుకంటే ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో లీడర్‌షిప్ స్టైల్ ఉంటుంది. ఎవరైనా కెప్టెన్సీ అప్పగించామంటే అతను ఇలాగే టీమ్‌ని నడిపించాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. అతను టీమ్‌ని తన స్టైల్‌లో నడిపించనీ, విజయాలు అందిస్తే చాలు...

ప్రతీ కెప్టెన్‌కి కావాల్సినంత సమయం ఇస్తాం. ఎందుకంటే ఒకటి రెండు సిరీసుల ఫలితాలను బట్టి కెప్టెన్సీ స్కిల్స్‌ని డిసైడ్ చేయలేం... ’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

గంగూలీ చేసిన కామెంట్లలో ఎలాంటి విమర్శలు లేకపోయినా రోహిత్ శర్మ కూల్ అండ్ కామ్ అంటూ, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీని దాదా పరోక్షంగా విమర్శిస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు...

కోపం అయినా, ప్రేమ అయినా ముఖం మీద చూపించడం విరాట్ కోహ్లీ అటిట్యూడ్‌. రోహిత్ శర్మ అలా చేయడని, చాలా మెచ్యూర్డ్ అని మెచ్చుకుంటున్న సౌరవ్ గంగూలీ, పరోక్షంగా కోహ్లీ కెప్టెన్సీలో మెచ్యూరిటీ లేదని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని అంటున్నారు కొందరు విరాట్ ఫ్యాన్స్..

click me!