సెల్ఫీలు ఇచ్చింది చాలు, ఇకనైనా సేఫ్‌గా ఉండండి... టీమిండియాకి ఆదేశాలు జారీ చేసిన బీసీసీఐ...

Published : Jun 28, 2022, 01:52 PM IST

దాదాపు రెండేళ్ల తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ నుంచి బయో బబుల్ నిబంధనలను తొలగించింది భారత క్రికెట్ బోర్డు. అయితే బయో సెక్యూర్ జోన్‌ను తొలగించిన నెల రోజుల్లో టీమిండియాలో కొన్ని కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి...

PREV
16
సెల్ఫీలు ఇచ్చింది చాలు, ఇకనైనా సేఫ్‌గా ఉండండి... టీమిండియాకి ఆదేశాలు జారీ చేసిన బీసీసీఐ...

ఇంగ్లాండ్ టూర్‌కి ముందు టీమిండియా టెస్టు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడగా, అంతకుముందు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా పాజిటివ్‌గా తేలి, కోలుకున్నాడని వార్తలు వచ్చాయి...

26

ఐదో టెస్టు ఆరంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడం టీమిండియాకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మ్యాచ్ సమయానికి రోహిత్ కోలుకోకపోతే ఎవరి కెప్టెన్సీలో టీమిండియా ఆడుతుందనేది ఇప్పటికీ తేలలేదు...

36

లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, తదితరులు అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ తెగ హల్‌చల్ చేశారు. రిషబ్ పంత్ అయితే ఏకంగా స్టేడియంలో జనాల్లోకి వెళ్లి ఫోటోలు దిగడం హాట్ టాపిక్ అయ్యింది...

46
Image credit: PTI

ఇంగ్లాండ్‌ టీమ్‌ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా కరోనా బారిన పడడంతో కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. మాస్కు లేకుండా బయటకి వెళ్లకూడదని, భౌతిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేసింది...

56

‘ఇష్టారాజ్యంగా పబ్లిక్‌గా తిరుగుతున్న కొందరు క్రికెటర్లకు బోర్డు చివాట్లు పెట్టింది. కరోనా ఇంకా పూర్తిగా తొలిగిపోకముందే మాస్కులు లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతూ, అభిమానులతో కలిసి ఫోటోలు దిగడాన్ని బీసీసీఐ గుర్తించింది. ఇది వారికే కాదు, జట్టుకి కూడా ప్రమాదమే...

66

అందుకే అనుమతి లేకుండా సిటీలో తిరగడాన్ని నిషేధించిన బీసీసీఐ, క్రికెటర్లు అందరూ తప్పనిసరి కనీస కోవిద్ నిబంధనలు పాటించాల్సిందిగా సూచించింది...’ అంటూ తెలిపారు ఓ బీసీసీఐ అధికారి...

Read more Photos on
click me!

Recommended Stories