టీ20 సిరీస్‌లో ఫెయిల్ అయితే అంతే! విరాట్ కోహ్లీ ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న బీసీసీఐ...

Published : Jul 07, 2022, 05:06 PM IST

ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ నెం.1 ప్లేస్‌ని అధిరోహించిన ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో పరుగుల వరద పారించిన ఈ రన్ మెషిన్‌కి ఇప్పుడు టైమ్ అస్సలు బాలేదు. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ, బ్యాటుతో పూర్ పర్ఫామెన్స్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సి వచ్చింది... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, ఇప్పుడు జట్టులో నుంచి కూడా తప్పించడానికి ప్రయత్నాలు చేస్తుందని కథనాలు వస్తున్నాయి...

PREV
18
టీ20 సిరీస్‌లో ఫెయిల్ అయితే అంతే! విరాట్ కోహ్లీ ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న బీసీసీఐ...

కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ ఏ మాత్రం మెరుగ్గా లేదు. ఈ ఏడాది 12 టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 28.73 సగటుతో 431 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...
 

28

అయితే మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు... విరాట్ కోహ్లీ కంటే వేగంగా పరుగులు చేస్తూ మాజీ కెప్టెన్ ప్లేస్‌కి ఎర్త్ పెడుతున్నారు. టీమిండియా కూడా టీ20ల్లో విరాట్ కోహ్లీని ఆడించకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం...

38

‘విరాట్ కోహ్లీ టీ20 కెరీర్‌ని ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ పర్ఫామెన్స్ డిసైడ్ చేయనుంది. అతను ఆ రెండు మ్యాచుల్లో రాణించడాన్ని బట్టే, విరాట్ టీ20 కెరీర్‌ని నిర్ణయించనుంది బీసీసీఐ. ఈ రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్‌ ఆడడం డౌటే...

48

టాప్ ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి దొరికేలా చూస్తూ, మ్యాచ్ ప్రాక్టీస్ కూడా జరిగేలా మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వన్డే సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా... విండీస్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొంటారు...

58

అయితే విరాట్ కోహ్లీని వెస్టిండీస్ సిరీస్‌లో ఆడించాలా? వద్దా? అనేది బీసీసీఐ ఇంకా నిర్ణయించుకోలేదు. ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఫెయిల్ అయితే, అతని టీ20 కెరీర్ ముగిసినట్టే...

68

ఎందుకంటే విరాట్ చాలా రోజులుగా టీ20ల్లో సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాడు...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేసినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనాన్ని ప్రచురించింది...
 

78

‘ప్రతీ గొప్ప ప్లేయర్ తమ కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసినవాళ్లే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఆడిన తీరు, అవుటైన విధానం రెండూ అద్భుతంగానే ఉన్నాయి. అతను మంచిగా ఆడుతున్నప్పుడు పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది...’ అంటూ కామెంట్ చేశాడు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...

88

టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 97 మ్యాచులు ఆడి 51.50 సగటుతో 3296 పరుగులు చేశాడు. 124 టెస్టుల్లో 32.75 సగటుతో 3308 పరుగులు చేసిన రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ టీ20 సగటు చాలా మెరుగ్గా ఉంది... 

Read more Photos on
click me!

Recommended Stories