వుమెన్స్ ఐపీఎల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ... వచ్చే ఏడాది ఐదు జట్లతో మహిళల క్రికెట్ లీగ్...

Published : Oct 18, 2022, 05:20 PM IST

పురుషుల ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు పూర్తయినా, ఇప్పటిదాకా వుమెన్స్ ఐపీఎల్ గురించి ఎలాంటి అడుగు వేయలేదు బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునాదులు బలంగా పాతుకుపోయిన తర్వాత వచ్చిన బీబీఎల్‌ వంటి లీగుల్లోనూ వుమెన్స్ కోసం స్పెషల్ టోర్నీలు నడుస్తుంటే, బీసీసీఐ మాత్రం అప్పుడూ ఇప్పుడూ అంటూ నాన్చుతూ వచ్చింది. ఎట్టకేలకు మహిళల ఐపీఎల్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది...

PREV
15
వుమెన్స్ ఐపీఎల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ... వచ్చే ఏడాది ఐదు జట్లతో మహిళల క్రికెట్ లీగ్...

కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీని ఏడోసారి సొంతం చేసుకుంది. దానికి ముందు ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచులన్నింటికీ మంచి టీఆర్పీ వచ్చింది. మహిళల క్రికెట్ మ్యాచులు చూసేందుకు జనాలు, స్టేడియాలకి కదిలి వచ్చారు...

25

మహిళల క్రికెట్‌కి పెరుగుతున్న ఆదరణ, ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీకి వచ్చిన రేటింగ్స్‌కి కళ్లు తెరిచిన భారత క్రికెట్ బోర్డు, వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది.. వచ్చే ఏడాది ఐదు జట్లతో వుమెన్స్ ఐపీఎల్ గ్రాండ్‌గా ప్రారంభించాలని బీసీసీఐ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం..

35
India Womens Cricket Team

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో బాధ్యతలు తీసుకున్న రోజర్ బిన్నీ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి సమావేశంలోనే వుమెన్స్ ఐపీఎల్ గురించి నిర్ణయం తీసుకున్నారు. . ఐదు జోన్ల పేరులో వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలను మొదలెట్టి, ఆ తర్వాత పురుషుల ఐపీఎల్ మాదిరిగా విస్తరించాలని భావిస్తోందట బీసీసీఐ... 

45

‘భారత్‌లో వుమెన్స్ క్రికెట్‌ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది, ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగానూ వుమెన్స్ క్రికెట్‌ని చూసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భవిష్యత్తు ఆడాళ్లదే...  ‘ది హండ్రెడ్’, ‘వుమెన్స్ బిగ్ బాష్ లీగ్స్’ ద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇప్పటికే మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడం మొదలెట్టాయి...

55

2018లో వుమెన్స్ టీ20 ఛాలెంజ్ పేరులో ఓ మూడు జట్లతో (వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్) టీ20 లీగ్‌ని ప్రారంభించింది బీసీసీఐ. వుమెన్స్ ఐపీఎల్ 2023లో ప్రారంభమైతే 2022 వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌కి ఆఖరి సీజన్ అవుతుంది... 

click me!

Recommended Stories