India vs Pakistan : ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై వివాదం మధ్య బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. సర్కార్ పాలసీ ప్రకారం ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.
ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై చాలా మంది ప్రముఖులు వ్యతిరేక గళం వినిపించారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అభిమానులు, మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను కొనసాగించవద్దని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వివాదం మొదలైంది.
DID YOU KNOW ?
శుభ్ మన్ గిల్
ఆసియా కప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఉన్నారు. టీమిండియా 9వ టైటిల్ టార్గెట్ గా ముందుకు సాగుతోంది.
25
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ ఏమన్నారంటే?
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై వివాదం నెలకొన్ని నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వివరణ ఇచ్చారు. "భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త పాలసీ ప్రకారం ఐసీసీ, ఏసీసీ లేదా బహుళ దేశాల టోర్నమెంట్‌లలో భారత్ ఆడవచ్చు. కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగవు" అని ఆయన తెలిపారు. అంటే ఇప్పట్లో భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు వుండవు.
35
పాకిస్తాన్ తో మ్యాచ్ లు.. కేంద్ర ప్రభుత్వ కొత్త విధానం
ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. అందులో, భారత ఆటగాళ్లు బహుళ దేశాల క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు, కానీ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక పోటీలు మాత్రం జరగవని స్పష్టం చేశారు. దీనిని గురించి సైకియా ప్రస్తావిస్తూ.. "ఏదైనా మల్టీనేషనల్ టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆడకపోతే అంతర్జాతీయంగా భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది" అని హెచ్చరించారు.
ఇది క్రికెట్ కు మాత్రమే పరిమితం కాదని సైకియా అన్నారు. "ఈ విధానం క్రికెట్‌కే కాదు, ఇతర క్రీడలకూ వర్తిస్తుంది. ఉదాహరణకు, అథ్లెటిక్స్‌లో ఒక ఆటగాడు పాకిస్థాన్ ప్రత్యర్థిని ఎదుర్కొనకపోతే, భారత అథ్లెటిక్స్ సమాఖ్యపై ఆంక్షలు పడవచ్చు. ఆ పరిస్థితిలో నీరజ్ చోప్రా వంటి క్రీడాకారులు కూడా అంతర్జాతీయ టోర్నమెంట్‌ల్లో ఆడే అవకాశం కోల్పోతారు" అని వివరించారు.
55
ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే బీసీసీఐ పాలసీ
బీసీసీఐ సెక్రటరీ మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. "ప్రభుత్వం నిర్ణయించిన పాలసీని బీసీసీఐ కచ్చితంగా అనుసరిస్తుంది. భారత్ ఏ మల్టీనేషనల్ టోర్నమెంట్‌లోనైనా అన్ని దేశాలతో ఆడాల్సిందే. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం పాకిస్తాన్ తో జరగవు" అని సైకియా అన్నారు.
దీంతో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తప్పనిసరి అని బీసీసీఐ స్పష్టం చేసింది. రాజకీయ, భద్రతా కారణాల వలన ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయినప్పటికీ, మల్టీనేషనల్ టోర్నమెంట్‌లలో ఆడక తప్పదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు.