భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మ తాజాగా ‘జీ న్యూస్’ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో బీసీసీఐ రహస్యాలను బట్టబయలు చేయడం సంచలనం రేపింది. ఈ వీడియోలో చేతన్.. ప్రధానంగా గంగూలీ - కోహ్లీ విభేదాలు, రోహిత్ - కోహ్లీల ఈగో, ఆటగాళ్ల ఫిట్నెస్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.