MI vs CSK: ధోని సీఎస్కే పై రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర

Published : Apr 20, 2025, 11:54 PM IST

MI vs CSK IPL 2025: ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓట‌ములు ఆగ‌డం లేదు. ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో సీఎస్కేపై ముంబై ఇండియ‌న్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్ శ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ లు అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు.   

PREV
15
MI vs CSK: ధోని సీఎస్కే పై రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర

MI vs CSK IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో ఫామ్ ను అందుకుంటూ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ నాక్ కు తోడుగా సూర్య‌కుమార్ యాద‌వ్ అద్భుమైన బ్యాటింగ్ తో ముంబై ఇండియ‌న్స్ మ‌రో విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ముంబై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.

25

అలాగే, చెపాక్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ధోని టీమ్ ను చెడుగుడు ఆడుకున్నారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు తుఫాను హాఫ్ సెంచ‌రీల‌తో మ్యాచ్ ను ఏక‌ప‌క్షంగా ముందుకు న‌డిపించాడు. చెన్నై ఇచ్చిన 177 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు. ఈ గెలుపుతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై జ‌ట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. సీఎస్కే చివ‌రి స్థానంలో ఉంది.

 

35

రోహిత్ శర్మ-సూర్య కుమార్ యాదవ్ చెన్నై బౌలింగ్ ను దంచికొట్టారు 

చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించడంతో అద్భుతమైన ఆరంభం లభించింది. రికెల్టన్ 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత‌ రోహిత్, సూర్యకుమార్ యాద‌వ్ జోడీ సీఎస్కేకు ఎక్క‌డా కూడా ఛాన్స్ ఇవ్వలేదు.

మ‌రో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబైకి విజ‌యాన్ని అందించారు. రోహిత్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాద‌వ్ టాప్ గేర్‌లో బ్యాటింగ్ చేసి కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 68 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు.

45
Rohit Sharma. (Photo- IPL)

జడేజా-దూబే హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లు

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రవీంద్ర జడేజా, శివం దూబే అర్ధ సెంచరీలు సాధించారు, కానీ వారి ఇన్నింగ్స్ లు జట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివం దుబే (50) రాణించడంతో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

55

ఆయుష్ మాత్రే  ఐపీఎల్ అరంగేట్రం

ఈ మ్యాచ్ లో 17 ఏళ్ల ఆయుష్ మాత్రే తన అరంగేట్రంలో చెన్నై ఇన్నింగ్స్ వేగాన్ని పెంచాడు. మాత్రే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా మాత్రే నిలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories