సరే తీసుకో.. పెళ్లి చేసుకో.. కెఎల్ రాహుల్ సెలవులకు బీసీసీఐ అనుమతి..

First Published Dec 2, 2022, 12:12 PM IST

KL Rahul Athiyashetty Wedding: త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న  టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది.  రాహుల్ పెళ్లి సెలవులకు అంగీకారం తెలిపింది. 

టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ బాలీవుడ్ నటీమణి  అతియా శెట్టిల వివాహం త్వరలోనే జరుగనుందని  వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే  ఓ సిరీస్ ఆడుతూ మరో సిరీస్ లో గాయంతోనో మరేదో కారణంతోనో  జట్టుకు దూరంగా ఉంటున్న  కెఎల్ రాహుల్ ఇప్పుడు పెళ్లికోసం లీవ్ పెట్టుకున్న విషయం తెలిసిందే. 

జనవరి  మొదటి లేదా రెండో వారంలో వీరి పెళ్లి జరుగనుందన్నట్టు సమాచారం. తన పెళ్లి నిమిత్తం  సెలవులు కావాలని రాహుల్ బీసీసీఐకి విన్నవించుకున్నాడు.   అంతేగాక తాను జనవరిలో జరిగే శ్రీలంక సిరీస్ కూ అందుబాటులో ఉండనని   బీసీసీఐకి తెలిపాడు. 

అయితే  రాహుల్  ప్రతిపాదన పరిశీలించిన  బీసీసీఐ.. అతడికి  సెలవులు మంజూరు చేసింది.  పెళ్లి తర్వాత  కూడా రాహుల్  కొన్ని రోజుల పాటు క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు.  పెళ్లయ్యాక హనీమూన్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు రాహుల్.   నేరుగా ఐపీఎల్ 2023 టోర్నీలో కెఎల్ రాహుల్ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

పొట్టి ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌ టూర్‌కి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్ టూర్ లో ఆడతాడుు.. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టెస్టు సిరీస్‌లో పాల్గొనే కెఎల్ రాహుల్.. పెళ్లి తర్వాత  మరోసారి  సెలవులు తీసుకుని పెళ్లి తంతు ముగించుకుని మార్చిలో మొదలయ్యే ఐపీఎల్ లోనే బరిలో దిగుతాడని తెలుస్తున్నది. 

ఈ ఏడాది   కెఎల్ రాహుల్ కు ఏదీ కలిసిరాలేదు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్  రాహుల్ ను భారీ ధర (రూ. 17 కోట్లు) వెచ్చించి తీసుకున్నా అతడు ఆశించిన స్థాయిలో రాణించలేదు. జట్టును కూడా ఆ స్థాయిలో నడిపించలేదు.  జాతీయ జట్టులో కూడా రాహుల్ విఫలమయ్యాడు.  గాయాలు,  ఇతరత్రా కారణాలతో ఏడాదిలో రాహుల్ జాతీయ జట్టులో ఆడిన మ్యాచ్ లు చాలా తక్కువ. 
 

click me!