టీమిండియా తర్వాతి కోచ్ రేసులో అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్... టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత...

First Published Sep 18, 2021, 9:32 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులో అన్యూహ్య మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించగా... కొత్త కోచ్ సారథ్యంలో మ్యాచులు ఆడనుంది భారత జట్టు...

ప్రస్తుత హెడ్‌కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో ముగియనుంది. ఆ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రేసులో ఇద్దరు మాజీ లెజెండరీ భారత క్రికెటర్లు ఉండడం విశేషం...

రవిశాస్త్రికి టీమిండియాకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లేని మరోసారి ఆ ప్లేస్‌లో నియమించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం...

జూన్ 2016లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న అనిల్ కుంబ్లే, ఒక్క ఏడాదిలోనే భారత జట్టుకి అద్వితీయ విజయాలను అందించాడు...

అనిల్ కుంబ్లే కోచింగ్‌లో టీమిండియా 35 మ్యాచుల్లో 22 విజయాలు అందుకుని... ఐదు డ్రాలతో 73 శాతం విజయాల రేటును సాధించింది...

అయితే విరాట్ కోహ్లీకి, అనిల్ కుంబ్లేకి మధ్య మనస్పర్థలు రావడంతో కేవలం ఇగో ఇష్యూ కారణంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పరాజయం తర్వాత అర్ధాంతరంగా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు అనిల్ కుంబ్లే...

టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్న అనిల్ కుంబ్లే, క్రమశిక్షణ విషయంలో బాగా కఠినంగా ఉంటాడు. ఇదే కోహ్లీకి, కుంబ్లేకి మధ్య గొడవలు పెరగడానికి కారణమైంది...

అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు వచ్చిన సమయంలో బీసీసీఐ హెడ్‌గా సౌరవ్ గంగూలీ ఉండి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేది. అందుకే అనిల్ కుంబ్లేని మళ్లీ హెడ్‌కోచ్‌గా నియమించి, ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను చెరిపేయాలని గంగూలీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం...

‘కోచ్‌గా కుంబ్లేకి మంచి రికార్డు ఉంది. అయితే ఆయన వీడ్కోలు మాత్రం సరిగా జరగలేదు. కేవలం విరాట్ కోహ్లీ ఒత్తిడి వల్లే అప్పుడు హెడ్‌కోచ్‌గా ఉన్న కుంబ్లేని అర్ధాంతరంగా తప్పించాల్సి వచ్చింది. అందుకే అనిల్ కుంబ్లే విషయంలో జరిగిన తప్పులను సరిచేయాలని బీసీసీఐ భావిస్తోంది... ’ అంటూ తెలిపారు బీసీసీఐ అధికారి...

అనిల్ కుంబ్లేతో పాటు భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారత కోచ్ రేసులో ఉన్నాడు. ఒకవేళ అనిల్ కుంబ్లే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించకపోతే... అతని స్థానంలో వీవీఎస్ హెడ్‌కోచ్‌గా నియమించాలని చూస్తోంది...

అనిల్ కుంబ్లే, హెడ్‌కోచ్‌గా రెండోసారి బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరిస్తే, బ్యాటింగ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి...

ప్రస్తుతం భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్ కూడా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాలని ఆతృతగా ఉన్నాడట. బ్యాటింగ్ కోచ్‌గా మంచి మార్కులు కొట్టేసిన విక్రమ్ రాథోడ్‌కి విరాట్ కోహ్లీతో, సెలక్టర్లతో, ప్రస్తుత హెడ్‌కోచ్ రవిశాస్త్రితో మంచి సంబంధాలు ఉన్నాయి...

click me!