ఇంగ్లాండ్ టూర్‌కి భారత జట్టు ఎంపిక... టెస్టు మ్యాచ్‌తో పాటు వన్డే సిరీస్‌కి మిథాలీరాజ్ సారథ్యం...

First Published May 15, 2021, 10:08 AM IST

ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లే భారత మహిళా జట్టును ప్రకటించింది బీసీసీఐ. మహళా జట్టు హెడ్ కోచ్‌గా డబ్ల్యూవీ రామన్ స్థానంలో రమేష్ పవార్ ఎంపికైన విషయం తెలిసిందే. మార్చిలో సౌతాఫ్రికా సిరీస్ తర్వాత భారత మహిళా జట్టు ఆడుతున్న సిరీస్ ఇదే...

ఇంగ్లాండ్ టూర్‌లో 8 ఏళ్ల గ్యాప్ తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది భారత మహిళా జట్టు. నాలుగు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్‌కి మిథాలీరాజ్ నాయకత్వం వహిస్తుంది...
undefined
ఇంతకుముందు వరుసగా మూడు టెస్టుల్లో కెప్టెన్‌గా విజయాన్ని అందుకున్న మిథాలీరాజ్, ఈ మ్యాచ్‌లో గెలిస్తే మహిళా క్రికెట్‌లో వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తుంది.
undefined
ఆల్‌-ఇండియా సీనియర్ వుమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన టెస్టు జట్టు, జూన్ 16 నుంచి 19 వరకూ బిస్టల్‌లో నాలుగు రోజుల టెస్టు ఆడుతుంది. ఆ తర్వాత జూన్ 27న వన్డే, జూన్ 30న డే-నైట్ వన్డే, జూలై 3న మూడో వన్డే ఆడుతుంది.
undefined
జూలై 9న మొదటి టీ20 (డే నైట్), జూలై 11న రెండో టీ20, జూలై 15న జరిగే మూడో టీ20 (డే నైట్) మ్యాచ్‌తో ఇంగ్లాండ్ టూర్ ముగిస్తుంది భారత మహిళా జట్టు...
undefined
టెస్టు వన్డే సిరీస్‌కి జట్టు: మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మందాన, పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణీ రాయ్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్తాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్..
undefined
టీ20 సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణీ రాయ్, శిఖా పాండే, పూజా వస్తాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్, సిమ్రాన్ దిల్ బహదూర్
undefined
click me!