మరోసారి న్యూజిలాండ్‌కి షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్... రెండో టీ20లో ఉత్కంఠ విజయం...

First Published Sep 3, 2021, 7:42 PM IST

142 పరుగుల లక్ష్యచేధనలో 137 పరుగులకి పరిమితమైన న్యూజిలాండ్... వరుసగా రెండు టీ20ల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్...

టీ20ల్లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి టీ20లో న్యూజిలాండ్‌ను 60 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లా, రెండో టీ20లో న్యూజిలాండ్‌ను స్వల్ప లక్ష్యఛేదనలో నిలువరించి... 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నయీమ్ 39 పరుగులు, లిటన్ దాస్ 33, మహ్మదుల్లా 32 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి రాణించారు. 

142 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నా, న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ 65 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నా... కివీస్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.

92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో 49 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసిన టామ్ లాథమ్ నాటౌట్‌గా నిలిచి కివీస్‌ని లక్ష్యానికి దగ్గరగా తేగలిగాడు. 

ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన దశలో ముస్తఫిజిర్ రహ్మాన్ మొదటి ఐదు బంతుల్లో 14 పరుగులు ఇచ్చినా... ఆఖరి బంతికి సిక్సర్ కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే తీయగలిగాడు టామ్ లాథమ్...

వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచిన న్యూజిలాండ్, 2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్‌ స్వదేశంలో ఆడిన గత 11 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించి, ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడడం విశేషం...

2021 సీజన్‌లో బంగ్లాదేశ్‌కి టీ20ల్లో 8వ విజయం, పాకిస్తాన్ మాత్రమే 9 విజయాలతో టాప్‌లో ఉంది...  న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటిదాకా 12 మ్యాచులు జరగగా... కివీస్‌ మొదటి 10 మ్యాచుల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కి ఇది వరుసగా రెండో విజయం...

click me!