రీఎంట్రీ ఇస్తున్న బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... బ్యాన్ తర్వాత విండీస్ సిరీస్‌తో...

First Published Jan 5, 2021, 11:23 AM IST

విండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు...

ఏడాది నిషేధం తర్వాత క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన షకీల్ అల్ హసన్...

ఆరంగ్రేటం తర్వాత తొలిసారి జట్టుకు దూరమైన మొర్తాజా...

బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... రీఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది. ఐపీఎల్‌లో ఓ బుకీ, తనను సంప్రదించాడనే విషయం దాచి పెట్టిన షకీబ్... ఏడాది సస్పెషన్‌కి గురయ్యాడు.
undefined
బ్యాన్‌కి ముందు బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్‌గా వ్యవహారించిన షకీబ్... ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్‌లో టాప్ ప్లేస్‌లో కూడా కొనసాగాడు.
undefined
షకీబ్‌పై ఐసీసీ విధించిన నిషేధం అక్టోబర్ 29తోనే ముగిసింది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో ఇన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న బంగ్లా క్రికెటర్లు, విండీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
undefined
వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు, వన్డే సిరీస్‌లో షకీబ్ అల్ హసన్‌కి చోటు కల్పించింది బంగ్లా క్రికెట్ బోర్డు.
undefined
మరోవైపు మాజీ కెప్టెన్ ముస్రఫ్ మొర్తాజాని వన్డే జట్టు నుంచి తొలగించింది బంగ్లా.
undefined
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లా బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మొర్తాజా... క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జట్టులో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి.
undefined
జట్టు ప్రయోజనాల దృష్ట్యా మొర్తాజానా పక్కన పెట్టాల్సి వచ్చిందని, యువ ఆటగాళ్లు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు బంగ్లా చీఫ్ సెలక్టర్ మిన్హజుల్ అబేదున్.
undefined
వెస్టిండీస్‌తో జనవరి 20 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది బంగ్లా క్రికెట్ జట్టు. వన్డే సిరీస్ తర్వాత టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.
undefined
మరోవైపు షకీబ్ అల్ హసన్ మూడోసారి తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు. గర్భంతో ఉన్న భార్య ఉమ్మే అహ్మద్‌ను ముద్దాడుతున్న ఫోటో షేర్ చేశాడు షకీబ్.
undefined
షకీబ్ అల్ హసన్, ఉమ్మే జంటను 2015లో అలైనా హసన్ అబ్రీ జన్మించగా ఆ తర్వాత రెండేళ్లకు మరో కూతురు జన్మించింది.
undefined
click me!