గంగూలీపై రాజకీయాల్లోకి రావాలంటూ పొలిటికల్ ప్రెషర్... గుండెపోటుకి కారణం ఇదేనా...

First Published Jan 4, 2021, 6:15 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. శనివారం గుండెపోటుకి గురైన గంగూలీ, ప్రస్తుతం నిలకడగా కోలుకుంటున్నారు. అయితే గంగూలీకి గుండెపోటు రావడానికి రాజకీయాల్లోకి రావాలని పొలిటికల్ పార్టీలు చేస్తున్న ఒత్తిడే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ సీపీఐ నాయకుడు అశోక్ భట్టాచార్య...

భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీకి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. భారత కెప్టెన్‌గా వ్యవహారంచిన సమయంలో గంగూలీ వ్యవహారించిన తీరు, ఆయనకి ‘దాదా’, ‘బెంగాల్ టైగర్’ వంటి బిరుదులను కూడా తెచ్చిపెట్టింది.
undefined
ఆ క్రేజ్‌ను పొలిటికల్‌గా వాడుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయని ఆరోపించాడు అశోక్ భట్టాచార్య...
undefined
‘సౌరవ్ గంగూలీ క్రేజ్‌ను కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి... అందుకే ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు...
undefined
దాదా క్రికెట్‌లో లీడర్ కానీ పొలిటికల్ లీడర్ కాదు... అది మరిచిపోయి కొందరు ఆయన్ని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు...
undefined
గంగూలీకి హార్ట్ ఎటాక్ రావడానికి ఇదే కారణమని నా ఉద్దేశం... రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదని సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా వీళ్లు పట్టించుకోవడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు అశోక్ భట్టాచార్య.
undefined
సీపీఐ నాయకుడైన అశోక్ భట్టాచార్య, సౌరవ్ గంగూలీ కుటుంబానికి చాలా ఏళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా... దీంతో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
undefined
అయితే అశోక్ భట్టాచార్య వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ తీవ్రంగా స్పందించాడు..
undefined
‘కొందరు ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని రాజకీయ కోణంలో చూస్తారని, అది వారి మానసిక పరిస్థితి అంటూ కామెంట్ చేశారు దిలీప్ ఘోష్..
undefined
సౌరవ్ గంగూలీకి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ఫాలోవర్లు, అభిమానులు ఉన్నారని... ఎవ్వరూ ఆయనపై ఒత్తిడి తేలేరని కామెంట్ చేశాడు దిలీప్ ఘోష్.
undefined
‘గంగూలీని రాజకీయాల్లోకి తీసుకురావాలని మేం ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతను ఓ స్పోర్ట్స్ ఐకాన్ మాత్రమే...’ అంటూ కామెంట్ చేశాడు తృణముల్ కాంగ్రెస్ నాయకుడు శోభండేబ్ ఛటర్జీ...
undefined
click me!